WHO Report : పులి రాజాకు ఎ** వస్తుందా? అని అప్పట్లో ఒక యాడ్ తెగ సందడి చేసేది.. మాట్లాడేవాడు మగవాడు..అనే ట్యాగ్ లైన్ కూడా మీడియాలో హోరెత్తేది. అప్పుడంటే సమాచార విప్లవం ఈ స్థాయిలో లేదు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అనేవి అంతగా వృద్ధి చెందలేదు. కాబట్టి అప్పట్లో ఆ ప్రకటనలు తెగ ప్రాచర్యం పొందాయి. పైగా అప్పట్లో హెచ్ఐవి అనేది ప్రపంచానికి పెను ముప్పు లాగా ఉండేది. అందువల్ల కం** వాడకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించేది. పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో వాటిని అందుబాటులో ఉంచేది. జనం కూడా భయపడి వాటిని వినియోగించేవారు. చాటుమాటు వ్యవహారాలు నడిపేవారు వాటిని ఉపయోగించేవారు.
ప్రస్తుతం కాలం మారింది. సాంకేతిక విప్లవం తారాస్థాయి దాటిని మించిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఒక్క క్లిక్ దూరంలో ఉంచేస్తోంది. అంతేకాదు ఒకప్పుడు ప్రపంచాన్ని మహమ్మారిల్లాగా ఇబ్బంది పెట్టిన హెచ్ఐవీ కి ఇప్పుడు శక్తివంతమైన మందులు కూడా వచ్చాయి. అందువల్ల హెచ్ఐవీ అంటే ఒకప్పటిలాగా ప్రజలకు భయం కూడా లేదు.. పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కం** వాడకం తగ్గింది. ఇది మేమంటున్న మాట కాదు.. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో వెళ్లడైంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించగా మనదేశంలో కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ లో మాత్రమే కం** ఉపయోగిస్తున్నారు.. ఇక్కడ పదివేల జంటలు ఉండగా.. శృంగారం లో పాల్గొంటున్నప్పుడు కం** లు కొనుగోలు చేస్తున్నారట.. మనదేశంలో ఆరు శాతం మందికి ఇప్పటికీ కం** ల గురించి తెలియదు. సకటన మనదేశంలో ప్రతి సంవత్సరం 33.07 కోట్ల కం** లు కొనుగోలు చేస్తున్నారట.
ఉత్తరప్రదేశ్లో వినియోగం పెరిగింది
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కం** ల వినియోగం అధికంగా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ 5.3 కోట్ల కం** లు అక్కడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉత్తరప్రదేశ్ జనాభా 22 కోట్లు దాటుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువ శాతం కం** లు అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.. కేంద్ర సర్వే ప్రకారం కం** వాడకం పూర్తిగా తగ్గుతోంది. పుదుచ్చేరి లో పదివేల జంటల అభిప్రాయాలు తీసుకోగా…తాము శృంగారం చేస్తున్నప్పుడు కం** లు వాటం లేదని వారు చెబుతున్నారు. ఈ జంటల్లో 960 మంది మాత్రమే కం** వాడుతున్నారు. పంజాబ్ లో 895, చండీగఢ్లో 822, హర్యానాలో 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్లో 514, గుజరాత్ రాష్ట్రంలో 430 జంటలు మాత్రమే తాము శృంగారం లో పాల్గొంటున్నప్పుడు కం** లు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే అరక్షిత, చాటు మాటు వ్యవహారాల జోలికి వెళ్ళినప్పుడు మాత్రం తాము కచ్చితంగా కం** లు వినియోగిస్తామని కొంతమంది పురుషులు చెప్పారు. అయితే ఇదే ప్రశ్నను మహిళలను అడగగా .. వారు సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. ఇక కొంతమంది మహిళలు తన భర్తలపై అనుమానం ఉంటే మాత్రం శృంగారం సమయంలో కం** కచ్చితంగా ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారట.. అలా అయితేనే దానికి ఒప్పుకుంటామని షరతు పెడుతున్నారట.. ఇక మరికొంతమంది పురుషులైతే కం** ఉపయోగించి శృంగారం చేస్తే మజా రాదని చెబుతున్నారట. చాటుమాటు వ్యవహారాల జోలికి వెళ్ళినప్పటికీ..తాము కం** వాడేదే లేదని స్పష్టం చేస్తున్నారట. అలాంటప్పుడు సుఖ వ్యాధులు వస్తాయి కదా అని ప్రశ్నిస్తే.. జీవితంలో ఆశించిన మేర సుఖం లభించినప్పుడు ఏది వచ్చినా ఇబ్బంది లేదని చెబుతున్నారట.