Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అగాధం పెరుగుతోంది. పీఆర్సీతో మొదలైన రగడ రాజుకుంటోంది. రోజురోజుకు పెరుగుతోంది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. దీంతో ఏపీలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఒక దశలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చదివించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వారి పిల్లలనైతే ప్రైవేటు పాఠశాలల్లో వారు వేతనాలు మాత్రం తీసుకునేది ప్రభుత్వ స్కూళ్లలో. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. విమర్శల దాడి ఎక్కువవుతోంది. ఫలితంగా సమస్య ఇంకా జఠిలమవుతోంది. సమ్మెకు వెళ్లాలనే డిమాండ్ తోనే ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
మరోవైపు ఉద్యోగులు వేతనాలు చెల్లించి పెరిగిన వేతనాలతో ఎందుకు సమ్మె చేస్తారని నిలదీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంతవరకు ఉద్యోగుల వేతనాల స్లిప్పుల పని ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం కూడా ఏం చెప్పలేకపోతోంది. ఉద్యోగులు సైతం తమ డిమాండ్లు తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాల్సి ఉన్నా వారు సమ్మె చేస్తామని చెప్పడంతో వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారని చెబుతున్నారు.
అసలు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదిలేలా జీవో తయారు చేయాలనే వాదనలు కూడా వస్తున్నాయి. వారి పిల్లలకైతే కాన్వెంట్ చదువులు పేదవారికేమో ప్రభుత్వ పాఠశాలలు. ఇది ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న పరిస్థితి. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేననే డిమాండ్లు కూడా వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు డైలమాలో పడుతున్నారు. తమ పిల్లల కోసం వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ ప్రభుత్వం దగ్గర వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వంపైనే పోరాటం చేయడం ఎంత వరకు కరెక్టు అనే సందేహం అందరిలో వస్తోంది. దీనిపై మంత్రులు కూడా తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ రాజీనామా వెనుక అసలు కారణమిదే…!
ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లతో ప్రభుత్వం చర్చలకు రావాలని చెబుతున్నా వారు రావడం లేదు. దీంతో సమస్య కొలిక్కి రావడం లేదు. దీంతో అందరిలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగులు చర్చలు జరిపితేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది అని చెబుతున్నా వారు మాత్రం మొండికేస్తున్నారు. ఫలితంగా సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోతోంది. ప్రభుత్వం సూచించే విధంగా ఉద్యోగులు చర్చలకు వచ్చి తమ డిమాండ్లు చెప్పి వాటిని పరిష్కరించాలని కోరే అవకాశం ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతో వారి వేతనాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగుల నిర్వాకంతో ప్రజాప్రతినిధులకు సైతం ఆగ్రహం వస్తోంది. ప్రభుత్వాన్ని నిందిస్తూ వ్యంగ్యంగా పాటలు పాడటం చేస్తున్నారు. దీంతో మంత్రులకు కోపం వస్తోంది. ఉద్యోగులపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో ఉపాధి పొందుతూ ప్రభుత్వాన్నే తిట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్మా ప్రయోగిస్తే వారికి ఎలాంటి అవకాశం ఉండదని తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇది ఎక్కడిదాకా పోతుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: పీఆర్సీపై పంతానికి పోతున్న ఉద్యోగ సంఘాలు.. జగన్ ఆ అస్త్రం ప్రయోగిస్తారా..?