AP Employees Issue: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ వలన తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని, తమకు పాత పద్ధతి ప్రకారమే వేతనాలు కావాలని ఉద్యోగులు ఏపీ సర్కారుపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగబోతున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
ఏపీ సర్కారు సైతం తాము వెనక్కి తగ్గేదేలేదని చెప్పింది. ట్రెజరీ శాఖ నుంచి జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఒకవేళ ఉద్యోగులు సమ్మెకు వెళ్లితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రెడీ అయినట్లు వార్తలొచ్చాయి. కాగా, ఈ ఫైట్ లో ఎవరూ వెనక్కి తగ్గుతారో అని చర్చ నడుస్తున్న క్రమంలో తాజాగా ఉద్యోగులు ప్రభుత్వంతో రాజీకి వచ్చినట్లు వారి చర్యల ద్వారా స్పష్టమవుతోంది.
Also Read: టీచర్లు, ప్రభుత్వం మధ్య ఫైట్
తమకు నూతన జీవో ప్రకారం వేతనాలు వద్దని తెలిపిన ఉద్యోగులు..చర్చలకు కూడా రాలేదు. కానీ, తాజాగా ఉద్యోగ సంఘాలు మనుసు మార్చుకున్నాయి. ప్రభుత్వంతో రాజీ మార్గానికి వచ్చేశాయి. పాత జీతాలు, పీఆర్సీ జీవోల నిలుపుదల, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలనే డిమాండ్లు నెరవేరిస్తే చర్చల గురించి ఆలోచిస్తామని తెలిపాయి. ఇందుకుగాను ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తే తాము వస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఇక ప్రకటన రాగానే ఏపీ సర్కారు లిఖితపూర్వక ఆహ్వానం పంపడం గమనార్హం. అలా ఉద్యోగులు చర్చలకు వెళ్లాల్సి వచ్చింది.
Also Read: పీఆర్సీపై పంతానికి పోతున్న ఉద్యోగ సంఘాలు.. జగన్ ఆ అస్త్రం ప్రయోగిస్తారా..?
ఉద్యోగులు ఈ నెల 3న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. అంతలోనే చర్చలకు వెళ్లాల్సి వస్తున్న క్రమంలో ప్రభుత్వంపై పోరాటంలో కొంత వెనక్కి తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తామనే హామీ వచ్చిన పక్షంలో ఉద్యోగులు ఇక సమ్మెకు వెళ్లే అవసరం ఉండకపోవచ్చు. అయితే, ప్రభుత్వం ఏపీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చే అవకాశాలున్నాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఉద్యోగులు ఐక్యంగా పోరాటంలో పాల్గొంటారని అనుకునే క్రమంలోనే ఇలా వెనక్కు తగ్గడం వెనుక ప్రభుత్వ పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది. ఏపీ సర్కారు ఉద్యోగులను కన్విన్స్ చేసేందుకుగాను ప్రయత్నిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. చూడాలి మరి.. ఉద్యోగులు.. ప్రభుత్వం మాటలను వింటారో లేదో..