పండుగ ఫియర్.. ముసురుకున్న కరోనా!

ఇప్పటికే కరోనాతో అగ్రదేశం అమెరికా అతలాకుతలం అయింది. లక్షలాది మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే.. సెకండ్‌ వేవ్‌ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏటా క్రిస్మస్‌, థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు భారీ ఎత్తున సమావేశం అవుతుంటారు. ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 13 మిలియన్లు దాటింది. 2,65,000 మందికి పైగా […]

Written By: NARESH, Updated On : November 30, 2020 7:38 pm
Follow us on

 

ఇప్పటికే కరోనాతో అగ్రదేశం అమెరికా అతలాకుతలం అయింది. లక్షలాది మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే.. సెకండ్‌ వేవ్‌ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏటా క్రిస్మస్‌, థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు భారీ ఎత్తున సమావేశం అవుతుంటారు. ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 13 మిలియన్లు దాటింది. 2,65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రెండు లక్షల కేసులు నమోదయ్యాయి.

అ క్రమంలో వస్తున్న క్రిస్మస్‌తో ప్రజలకు మరింత ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతకాదు.. కోవిడ్‌ విజృంభిస్తునేన తీరుపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. థ్యాంక్స్‌ గీవింగ్‌ వేడుకల తర్వాత కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని, దీంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని చెప్పారు.

అయితే.. ఇవి ఎవరినీ భయపెట్టడానికి చెబుతున్న మాటలు కావని.. ప్రజలు మరింత అప్రమత్తం కావాలని ఉద్దేశంతోనేనని సూచించారు. తొలినాళ్లలో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రజలు కరోనా వ్యాప్తిని అరికట్టే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫిబ్రవరి కల్లా వ్యాక్సిన్‌ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మాస్క్‌లు ధరించడం.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పనిసరి అన్నారు.

మరోవైపు.. కోవిడ్‌ వ్యాప్తిపై మరో నిపుణురాలు డెబోరా బిర్‌‌క్స్‌ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెండో విడత వ్యాప్తిలో రోజుకు 25 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల రేటు కాస్త తక్కువగానే ఉంది. కానీ.. థ్యాంక్స్‌ గివింగ్‌ తర్వాత వైరస్‌ వ్యాప్తి పదింతలు పెరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.