https://oktelugu.com/

కేసీఆర్‌‌కు గడ్డు రోజులేనా..!

గ్రేటర్‌‌ ఎన్నికల పోరు ప్రజలకు ఎలా ఉందో కానీ.. పార్టీలకు మాత్రం తీవ్ర టెన్షన్‌ పట్టుకుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీని కంగారు పెడుతున్నారు. గత ఏ ఎన్నికల్లోనూ అధికార పక్షం ఇంత ఉత్కంఠకు గురైనట్లు లేదు. వార్‌‌ వన్‌ సైడ్‌ అన్నట్లుగానే అన్ని ఎన్నికల్లోనూ సాఫీగా విజయం సాధించింది. అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు భిన్నంగా మారిపోయింది. కాంగ్రెస్‌తో ప్రధాన పోటీ ఉంటుందని ముందుగా అంచనా వేసినా, బీజేపీ బలం పెంచుకోవడం టీఆర్ఎస్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2020 / 07:41 PM IST
    Follow us on

    గ్రేటర్‌‌ ఎన్నికల పోరు ప్రజలకు ఎలా ఉందో కానీ.. పార్టీలకు మాత్రం తీవ్ర టెన్షన్‌ పట్టుకుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీని కంగారు పెడుతున్నారు. గత ఏ ఎన్నికల్లోనూ అధికార పక్షం ఇంత ఉత్కంఠకు గురైనట్లు లేదు. వార్‌‌ వన్‌ సైడ్‌ అన్నట్లుగానే అన్ని ఎన్నికల్లోనూ సాఫీగా విజయం సాధించింది. అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు భిన్నంగా మారిపోయింది. కాంగ్రెస్‌తో ప్రధాన పోటీ ఉంటుందని ముందుగా అంచనా వేసినా, బీజేపీ బలం పెంచుకోవడం టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

    దీనికి తోడు ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగింది. పలు సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. దీంతో టీఆర్‌‌ఎస్‌ పార్టీకి మిరంత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల్లో గట్టెక్కకపోతే , రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే భయం టీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. అసలు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ లేని విధంగా ఇంతగా భయపడడానికి కారణం అనేక అంశాలు కూడా ఉన్నాయి.

    కరోనా టైంలో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వం తమను సరిగా పట్టించుకోలేదనే అభిప్రాయం పేద, మధ్యతరగతి వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. కరోనా కట్టడికి, కరోనా నిర్ధారణ పరీక్షలు, ట్రీట్‌మెంట్ వంటి విషయాల్లోనూ ప్రభుత్వం ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. కేసీఆర్ సైతం చాలాకాలం ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనే సమాచారం ఎవరికీ తెలియకపోవడం, కీలకమైన సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వ్యవహరించలేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

    అకస్మాత్తుగా గ్రేటర్‌‌ను ముంచెత్తిన వరదల కారణంగా ప్రభుత్వం పరువు ప్రతిష్ట మొత్తం మంట గలిసింది. వరదల కారణంగా వారం రోజుల పాటు ప్రజలు నరకయాతన అనుభవించినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు. వరద సహాయం కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోయారని ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఈ సందర్భంలో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటే వెళ్తే.. ఎన్నో అంశాలు టీఆర్ఎస్‌కు ఇప్పుడు టెన్షన్ కలిగిస్తున్నాయి.