భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 368 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు లక్ష రూపాయలకు పైగా వేతనం పొందవచ్చు. ఈ ఉద్యోగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 355 ఉండగా మేనేజర్ ఉద్యోగాలు 13 ఉన్నాయి.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, టెక్నికల్, ఫైర్ సర్వీస్, టెక్నికల్ ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మేనేజర్ స్థాయి పోస్టులకు బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి అనుభవం లేకపోయినా జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30.11.2020 నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మాత్రం 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా డిసెంబర్ 15వ తేదీన ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 14, 2021లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
మేనేజర్ ఉద్యోగాలకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనం లభిస్తుండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల మధ్య వేతనం లభిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.