తాజాగా స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తన విధికి ముందు మద్యం సేవించినందుకు ఒక మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం చర్చనీయాంశం అయింది. కానీ ఆమె చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తాను తప్పు చేయలేదని చెబుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమెకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. తన విధికి రావడానికి తొమ్మిది గంటల ముందు మద్యం తాగింది. అంతే కానీ వచ్చేటప్పుడు కాదని పేర్కొంది.
అయితే కంపెనీ నిబంధనల ప్రకారం విదికి వచ్చే టప్పుడు మద్యం తాగి రాకూడదు. కానీ ఆమె ముందే అల్కహాల్ తీసుకోవడంతో అది నేరం కాదని వాదించింది. పైగా ఆమె ఆ ఆఫీసులో 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తోంది. బ్రీఫింగ్ సమయంలో మీరు మద్యం తాగారా అని ప్రశ్నించారు మేనేజర్. దీనికి ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. దీంతో తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమె మాత్రం ఊరుకోకుండా న్యాయస్థానంలో కేసు వేసింది. తన డ్యూటీకంటే ముందు మద్యం తాగినట్లు చెప్పింది. కానీ విధులకు వచ్చేటప్పుడు మాత్రం తాగలేదని పేర్కొంది. దీంతో కోర్టు ఆమెకు నష్టపరిహారంగా 5454 యూరోలు అంటే దాదాపు ఐదు లక్షల యాభై వేలు కంపెనీ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కంపెనీ కోర్టు తీర్పును పాటిించాల్సి వచ్చింది.