Pooja Hegde Most Eligible Bachelor: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) సినిమాలో క్రేజీ అండ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, తాజాగా పూజా హెగ్డే తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధం అయింది. ఈ సినిమాలో తన పాత్రకు తెలుగులో తానే డబ్బింగ్ చెబుతుంది. ఈ మేరకు ఒక స్టిల్ ను కూడా వదిలింది చిత్రబృందం. పూజా హెగ్డే డబ్బింగ్ వెర్షన్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.
ఇక ఈ సినిమాని అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి. పైగా ఫుల్ ఫాలోయింగ్ తో లక్కీ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజా హెగ్డే ఈ సినిమా కోసం పరిధి దాటి మరీ నటించిందట. ఇందులో భాగంగానే పూజా హెగ్డే చేత బికినీ కూడా వేయించారని టాక్ నడుస్తోంది.
ఎలాగైనా అఖిల్ కి ఈ సినిమాతో భారీ హిట్ రావాలని మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే పూజా హెగ్డే చేత భా రీగానే ఎక్స్ పోజింగ్ చేయించారు. అఖిల్ హిట్ కోసం పూజా హెగ్డే కూడా బికినీ వేసి.. ఈ సినిమాలో రెండు రొమాంటిక్ సాంగ్స్ లో నటించింది. మరి పక్కా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ అవుతుందా ?
నిజానికి ఈ సినిమాకి స్ట్రైట్ రిలీజ్ డేట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సోలో రిలీజ్ డేట్ దొరకలేదు. అక్టోబర్ సెకండ్ వీక్ లో ఏకంగా మూడు చిత్రాలు పోటీగా సిద్ధం కానున్నాయి. కాబట్టి ఆ పోటీలో వచ్చి బ్యాచలర్ హిట్ కొట్టాలి. అలా హిట్ కొట్టాలి అంటే.. సినిమాలో సాలిడ్ మ్యాటర్ ఉండాలి. ఆ రేంజ్ మ్యాటర్ బ్యాచిలర్ లో ఉందా అంటే.. డౌటే.
కాకపోతే పూజా హెగ్డే గ్లామర్ కోసమైనా యూత్ సినిమా ఫస్ట్ షో కోసం ఎగ బడే ఛాన్స్ ఉంది. అలాగే అఖిల్ తో పూజా హెగ్డే కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందట. మరి చూడాలి బ్యాచిలర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో. బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.