Modi Ruling : మోడీ పుట్టిన రోజున ఆయన మార్క్ పాలనపై స్పెషల్ ఫోకస్

Modi Ruling: ఆశ్చర్యకరంగా తెలంగాణ విమోచన దినం.. ప్రధాని మోడీ పుట్టినరోజు ‘సెప్టెంబర్ 17 ’ కావడం విశేషమనే చెప్పాలి. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటుంటే.. దేశవ్యాప్తంగా మోడీ అభిమానులు ఆయన పుట్టినరోజున ‘వ్యాక్సినేషన్’తోపాటు ఇతర కార్యక్రమాలతో పండుగలా చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మోడీ పరిపాలన దేశంలో ఎలా ఉందనే దానిపై మనం ఫోకస్ చేద్దాం.. నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వచ్చాక మొత్తం 20 సంవత్సరాలు పరిపాలించారు. అందులో 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా చేశాడు. 7 […]

Written By: NARESH, Updated On : September 17, 2021 7:24 pm
Follow us on

Modi Ruling: ఆశ్చర్యకరంగా తెలంగాణ విమోచన దినం.. ప్రధాని మోడీ పుట్టినరోజు ‘సెప్టెంబర్ 17 ’ కావడం విశేషమనే చెప్పాలి. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటుంటే.. దేశవ్యాప్తంగా మోడీ అభిమానులు ఆయన పుట్టినరోజున ‘వ్యాక్సినేషన్’తోపాటు ఇతర కార్యక్రమాలతో పండుగలా చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మోడీ పరిపాలన దేశంలో ఎలా ఉందనే దానిపై మనం ఫోకస్ చేద్దాం..

నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వచ్చాక మొత్తం 20 సంవత్సరాలు పరిపాలించారు. అందులో 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా చేశాడు. 7 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్నాడు. మోడీ 20 ఏళ్ల పాలన అనేది ఒక మనిషిని అంచనా వేయడానికి తక్కువ సమయం కాదు. పూర్తిగా రెండు దశబ్ధాల పాలన అనేది చాలా పెద్ద చరిత్ర.

మోడీ పరిపాలన కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. మోడీ విషయంలో ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ‘మోడీ తను నమ్మింది చేస్తాడు. మోడీ ఎవరి కోసమో.. తన సొంత జేబులో డబ్బులు పెట్టుకోవడం కోసమే పనిచేయడు. అవినీతి అనేది మోడీకి వ్యక్తిగతంగా లేదు’ అన్నది ప్రజలు ఈరోజుకు బలంగా నమ్ముతున్న విషయాలు.

ఒక పేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో చాయ్ వాలా నుంచి ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తిగా ప్రజలు మోడీని చూస్తున్నారు. అంతేకాదు.. అవినీతి మరకలు అనేవి మోడీకి అంటవు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పరిపాలన పరంగా.. రాజకీయ పరంగా మోడీవి తప్పులు ఉండొచ్చు. కొంతమందిని పరోక్షంగా ప్రోత్సహించవచ్చు. అటువంటివి రాజకీయ పరమైన చర్యలు చేస్తే చేసి ఉండొచ్చు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం మోడీపై క్లీన్ ఇమేజ్ ఉందని ప్రజలు ఘంఠాపథంగా చెబుతున్నారు. ఇదే చాలా ఇంపార్టెంట్ అంశం.

అయితే మనం గమనిస్తే మోడీలో వ్యక్తిగత, నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అవి ప్రజల కోసం మంచికి ఉపయోగించినప్పుడు బాగానే ఉంటుంది.. ప్రజలకు ఉపయోగపడనప్పుడు వ్యతిరేకం అవుతుంది. ఈ క్రమంలోనే మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన మార్క్ పాలన ఎలా ఉందో ‘రామ్ టాక్’ స్పెషల్ వీడియో చూద్దాం..