https://oktelugu.com/

Farmers : రైతుల పంట పండించే మంచి పథకాలు.. కచ్చితంగా తెలుసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆర్థిక అవసరాల్లో సాయం అవడానికి కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది. రైతుల ఆదాయాలను పెంచడమే వీటి లక్ష్యం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 10, 2024 / 04:26 PM IST

    Farmers

    Follow us on

    Farmers : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆర్థిక అవసరాల్లో సాయం అవడానికి కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది. రైతుల ఆదాయాలను పెంచడమే వీటి లక్ష్యం. అందుకే కేంద్రం ఈ పథకాలను అమల్లోకి తెచ్చింది. మరి ఆ పథకాలు ఏంటో తెలుసుకుందామా?

    పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN): ఈ పథకం ద్వారా రైతులకు సాయంగా ఏటా ఎకరానికి రూ.6 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో అందజేస్తారు. ఒక విడతకు రూ.2000 అందిస్తున్నారు. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఫిబ్రవరి 24, 2019న దీన్ని ప్రారంభించారు. 11 కోట్ల మంది రైతులు రూ. 2.81 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లబ్ధి పొందారు. దేశంలోని ఏ రైతు అయినా ఈ పథకానికి అప్లే చేసుకోవచ్చు.

    ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM KMY). ఇది పీఎం కిసాన్ మాన్ ధన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్. చిన్న, సన్నకారు రైతులు నెల నెల పెన్షన్ ఫండ్‌కు సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తూ ఉండాలి. ఇలా ఇందులో సభ్యుడిగా చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొంత నగదును అందిస్తుంది. రూ. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు దీనికి అర్హులు. వీరు నెలకు రూ. 55 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. ఇలా పూర్తిగా వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కడుతూ ఉండాలి. కట్టిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది. ఇందులో 23.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.

    ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY): ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. పంట వేసినప్పటి నుంచి కోత తర్వాత వరకు ఏమైనా ప్రకృతి వైపరీత్యాల సంభవించి రిస్క్ జరిగితే దానికి రక్షణగా ఈ పథకం రిస్క్ కవర్‌ను అందిస్తుంది. పంటలకు బీమా సౌకర్యాన్ని అందిస్తుంది ఈ పథకం. ఈ పథకం ద్వారా మొత్తం 5549.40 లక్షల రైతులు బీమా సదుపాయం అందుకుంటున్నారు. పథకం ప్రారంభం అయిన దగ్గర నుంచి రూ. 150589.10 కోట్లు రైతులకు క్లెయిమ్‌గా చెల్లించారు.

    కిసాన్ క్రెడిట్ కార్డ్: దీన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయ ఖర్చులకు రుణం అందిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ సబ్సిడీతో ప్రతి సంవత్సరం 4 శాతం వడ్డీతో రుణం ఇస్తారు. 2.5 కోట్ల మంది రైతులు దీని ద్వారా రుణాలు అందుకున్నారు. బ్యాంకులు వీటిని అందిస్తాయి.

    పరంపరగత్ కృషి వికాస్ యోజన: ఈ పథకం ద్వారా రైతులు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం పొందే అవకావం ఉంది. ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, సేంద్రీయ ఉత్పత్తి, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఈ ఆర్థిక సాయం వస్తుంది. దీని ద్వారా ఆర్థిక సాయం చేస్తూనే సేంద్రీయ వ్యవసాయాన్ని పోత్సహిస్తోంది కేంద్రం.

    సవరించిన వడ్డీ రాయితీ పథకం: దీని ద్వారా పశుపోషణ, పాడి, మత్స్య పరిశ్రమ వారు రుణాలు పొందవచ్చు. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో రూ.3 లక్షలు వరకు రుణాలు అందుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలి. ఇలా చెల్లిస్తే వడ్డీ రేటును ఏడాది 4%కి తగ్గిస్తారు కూడా. మిగిలిన 3 శాతం వడ్డీ కేంద్రం అందిస్తుంది.