భయపెడుతున్న మేఘాలు

ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి చాలా కష్టాలు పడుతున్నారు రైతులు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను ఎలా అమ్ముకోవాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ చినుకులు వస్తాయనే భయంతోనే గడుపుతున్నాడు. పండించిన పంట అమ్ముడుపోయే దాకా తడిస్తే ఎలా అని మథన పడుతున్నాడు. వరుణుడు మాత్రం రోజూ వస్తున్నట్లుగా చేస్తుండడంతో దిగులు చెందుతున్నాడు. ఐకేపీ కేంద్రాల నిర్లక్ష్యం ఐకేపీ కేంద్రాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పంట కొనుగోలు చేసేందుకు […]

Written By: Srinivas, Updated On : May 18, 2021 8:59 am
Follow us on

ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి చాలా కష్టాలు పడుతున్నారు రైతులు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను ఎలా అమ్ముకోవాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ చినుకులు వస్తాయనే భయంతోనే గడుపుతున్నాడు. పండించిన పంట అమ్ముడుపోయే దాకా తడిస్తే ఎలా అని మథన పడుతున్నాడు. వరుణుడు మాత్రం రోజూ వస్తున్నట్లుగా చేస్తుండడంతో దిగులు చెందుతున్నాడు.

ఐకేపీ కేంద్రాల నిర్లక్ష్యం
ఐకేపీ కేంద్రాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పంట కొనుగోలు చేసేందుకు తేమ శాతం సాకుగా చూపడంతో కేంద్రాల్లోనే ధాన్యం ఉండిపోతోంది. దీంతో మేఘాల ప్రభావంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. వాన వస్తుందనే భయంతో రోజూ పరదలు తీసి ఆరబెట్టి మళ్లీ కప్పుకోవడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా అధికారుల్లో నిర్లిప్తతత వీడడం లేదు. ఫలితంగా అన్నదాతల అగచాట్లు తప్పడం లేదు.

మేఘావృతంతో..
ప్రతి రోజూ ఆకాశం మేఘావృతంగా ఉండడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ వాన పడుతుందో ధాన్యం తడుస్తుందో అని బాధ పడుతున్నారు. అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలులో వేగం పెంచకపోతే మా పరిస్థితి ఏంటని దుఖిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించి రైతుల సమస్యలు తీర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రతి సారి తప్పని తిప్పలు
ధాన్యం విక్రయించడనికి ప్రతి కాలంలో కూడా రైతుల తిప్పలు తప్పడం లేదు. దీంతో పంట అమ్ముకోవడానికి సైతం తంటాలు పడాల్సి వస్తోంది. పండించడానికి కష్టమే. విక్రయించుకుందామంటే సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది. ధాన్యం కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉండడంతో ఏ పని చేసుకోలేక ధాన్యం వద్దే కాపు కాయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరగా అమ్ముకుంటే మళ్లీ ఏదైనా పని చేసుకునే వీలుంటుంది. కానీ అలా కాక కేంద్రంలోనే ధాన్యం కుప్పలు పోసుకుని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ నిరీక్షించే స్థితి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచి లారీల కొరత లేకుండా చూసి త్వరగా అమ్ముకునేలా రైతులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.