Homeజాతీయ వార్తలుఈటల వ్యవహారం ఏమైంది?

ఈటల వ్యవహారం ఏమైంది?

Etela Rajenderరాజకీయ దుమారం రేపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం మరుగున పడినట్లయింది. ఓ వారం రోజుల పాటు అన్ని పత్రికలు, చానళ్లలలో రాజేందర్ ఎపిసోడ్ బాగానే నడిచినా ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోయింది. టీఆర్ఎస్ ఉద్దేశమేంటి? ఆయనను పార్టీలో కొనసాగిస్తున్నట్లా? లేక సస్పెండ్ చేసి ఇంటికి పంపినట్లా? ఏది తెలియడం లేదు. ధీంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు రాజేందర్ భవిష్యత్ వ్యూహమేంటి? పార్టీ పెడతారా? లేక ఇదే పార్టీలో కొనసాగుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా చాటున
కరోనా ప్రబలం కావడంతో ఈటల రాజేందర్ గురించి అందరు మర్చిపయినట్లయింది. ఆయన గురించి ఏవేవో కథనాలు వెలువడ్డాయి. కొత్త పార్టీ పెడతారని, నాయకులను సమీకరిస్తున్నారని పలు ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. కానీ చివరికి ఏమీ లేదని తేలిపోయింది. పార్టీ పెట్టి గులాబీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ మళ్లీ ఆలోచనలో పడినట్లుంది. ఏం చేయాలనే దానిపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనట్లు కనబడుతోంది. దీంతో ఈ వ్యవహారం గురించి మరచిపోయారు.

అధినేత మదిలో..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మదిలో ఏముందో తెలియడం లేదు. సాధారణంగా పార్టీ విధానాలపై విమర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ముందుండే కేసీఆర్ ఈ దఫా ఎందుకో వెనకడుగు వేశారు. భూ కబ్జా వ్యవహారంలో బాధ్యుడుగా తేల్చినా రాజేందర్ ను పార్టీ నుంచి బహిష్కరించారే కానీ ఇంకా ఏ రకమైన క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ఆ భూముల వ్యవహారంలో ఇంకా చాలా మంది ఉన్నట్లుతెలియడంతో కినుక వహించినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈటల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు చెబుతున్నారు

ఈటల వ్యూహమేంటి?
ఈటల రాజేందర్ ఎటు వైపు వెళతారో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. కొత్త పార్టీ పెడతారనే వార్తలు వ్యాపించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టి దాన్ని నడపడం అంటే మాటలు కాదు. దానికి చాలా డబ్బు కావాలి. నాయకులు కావాలి. కార్యకర్తలు కావాలి. సహనం ఉండాలి. ఇవన్నీ ఇమిడించుకున్న నాయకుడే పార్టీని నడపగలుగుతారు. అందుకే రాజేందర్ కొత్త పార్టీ వ్యవహారాన్ని కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper
Exit mobile version