Family Planning Operation: ఇబ్రహీం పట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి పలువురు మరణించడం తీవ్రవిషాదం నింపింది.పలువురు అనారోగ్యంతో అపోలో జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి ఇతర నేతలు పరామర్శించారు.
ఇబ్రహీం పట్నంలో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. వాళ్లంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారు.అల్లుడు హరీష్ రావు సమర్థుడు అని కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రిని చేశాడు. ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభుత్వం గొప్పలు చెబుతోంది.కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తాయని చెప్పారు. 34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారు
హైద్రాబాద్ కు కుత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది.అయినా ఇన్నిరోజులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది అపోలో లో చాలా మందికి ఐసియు లో చికిత్స అందుతోంది. ఈ హాస్పిటల్ లో పేషంట్స్ పర్యవేక్షణ కోసం ఒక్క వైద్య శాఖ అధికారులు లేరు. ఇక్కడికి తెచ్చి జాయిన్ చేసి వదిలేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మచి నాణ్యమైన వైద్యం అందితే .. కార్పోరేట్ హాస్పిటల్ కు అందుకు తెచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వీర్యం గా పనిచేస్తున్నాయి ఈ ఘటనలో ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతున్నారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి . మామ అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చదివించాలని..ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారికి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదు .. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలన్నారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వరకు వారికి అండగా కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు