Brahmaji – Anasuya: అంకుల్ ఏంట్రా అంకుల్… నీ మీద కేస్ వేస్తా… ఇది ఏజ్ బాడీ షేమింగ్ అంటూ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. వాట్స్ హ్యాపెనింగ్ అంటూ ఓ ఫోటో బ్రహ్మాజీ పోస్ట్ చేయగా, నెటిజెన్ అంకుల్ అని కామెంట్ చేశాడు. దానికి సమాధానంగా బ్రహ్మాజీ అలా స్పందించారు. బ్రహ్మాజీ అంకుల్ అంటే కేసు వేస్తానని చెప్పింది ఖచ్చితంగా అనసూయను ఉద్దేశించే. ఆయన పరోక్షంగా అనసూయను ట్రోల్ చేసినట్లు అయ్యింది. బ్రహ్మాజీ ట్వీట్ క్రింద కామెంట్స్ చూసినా ఇది అర్థం అవుతుంది. చివరికి మీరు కూడా తగులుకున్నారా ఆంటీని? అని సోషల్ మీడియా జనాలు నవ్వుకుంటున్నారు.

అనసూయ ఈ మధ్య చేసిన రాద్ధాంతం ఇండస్ట్రీ పెద్దలకు మండేలా చేసిందన్న వాదన వినిపిస్తుంది. దాని ఎఫెక్ట్ బ్రహ్మాజీ ట్వీట్ రూపంలో బయటికి వచ్చింది అంటున్నారు. ఏళ్ల తరబడి ప్రరిశ్రమ మీద ఆధారపడి బ్రతికిన అనసూయ ఓ మూవీ ప్లాప్ కావడాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. ఒక సినిమా ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి ఇస్తుంది. అలాంటి సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోతారు. సినిమాలు రావాలంటే నిర్మాతలు ఉండాలి. ఇవన్నీ మరచి ఒక వ్యక్తిపై ఉన్న పగతో ఆమె సినిమా పోవాలని కోరుకోవడం పరిశ్రమ పెద్దల ఆగ్రహానికి కారణమైంది.
లైగర్ మూవీ ఫలితం కర్మ ఫలమే, తల్లిని తిట్టిన వారికి ఇలానే జరుగుతుందని అనసూయ ఇండైరెక్ట్ ట్వీట్ చేశారు. దానితో ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం షురూ చేశారు. ఎప్పుడో 2017లో జరిగిన అర్జున్ రెడ్డి మూవీ వివాదాన్ని ఆమె ఇప్పుడు తెరపైకి తేవడం కూడా సమర్ధనీయంగా లేదు. సీనియర్ నటుడైన బ్రహ్మాజీ అనసూయపై ఉన్న తన కోపాన్ని ఈ రూపంలో చూపించాడనిపిస్తుంది. అందులోనూ బ్రహ్మాజీ దర్శకుడు పూరికి అత్యంత సన్నిహితుడు. కృష్ణ వంశీ, పూరి, రవితేజ, బ్రహ్మాజీ పరిశ్రమకు ఒకేసారి వచ్చినవారు, కలిసి ఎదిగినవారు.

ఆంటీ అంటే కేసు వేస్తానన్న అనసూయ అన్నంత పని చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు మూడు రోజులు ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం నడిచిన నేపథ్యంలో బ్రహ్మాజీ అంకుల్ అంటే కేసు వేస్తానని అనసూయను గెలకడం ఖచ్చితంగా ఆమెపై ఉన్న కోపమే అని కొందరు విశ్లేషిస్తున్నారు.
[…] Also Read:Brahmaji – Anasuya: అనసూయపై ఇండస్ట్రీకి మండింది?… […]