https://oktelugu.com/

కరోనా మీద తెలంగాణ సీఎం కాకిలెక్కలు?

‘కరోనా మన దేశంలో పుట్టింది కాదు. దేశంలో 83 మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి. కరోనాపై ప్రజలెవరూ భయపడొద్దు. తెలంగాణ వాసులకు కరోనా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఒకరికి చికిత్స నడుస్తోంది. మరో ఇద్దరికి పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు రావాల్సి ఉంది. కరోనాపై ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కరోనా మీద ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటాం. ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 02:57 PM IST

    Carona in telangana

    Follow us on

    ‘కరోనా మన దేశంలో పుట్టింది కాదు. దేశంలో 83 మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి. కరోనాపై ప్రజలెవరూ భయపడొద్దు. తెలంగాణ వాసులకు కరోనా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఒకరికి చికిత్స నడుస్తోంది. మరో ఇద్దరికి పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు రావాల్సి ఉంది. కరోనాపై ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కరోనా మీద ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటాం. ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది.’ మార్చి 13న సీఎం కేసీఆర్‌‌ పలికిన పలుకులివి.

    Also Read : కరోనా : మన చదువుల క్యాలెండర్ కు దెబ్బ

    కరోనా రాష్ట్రంలోకి అప్పుడప్పుడే అడుగిడుతున్న సందర్బంలో ఒక్కటే నెలలో రూ.500 కోట్లు విడుదల చేశామని చెప్పిన సీఎం కేసీఆర్‌‌.. మరి ఈ ఐదు నెలల కాలంలో ఎన్నికోట్ల నిధులు ఖర్చు చేశారు..? కేంద్రం నుంచి కరోనా కట్టడికి ఎన్ని వేల కోట్లు వచ్చాయి..? దాతలు సీఎంఆర్‌‌ఎఫ్‌కు ఇచ్చిన నిధులన్ని ఎటుపోయాయి..? అసలు కరోనా ట్రీట్‌మెంట్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత వరకు ఖర్చు చేసింది..? కరోనాను ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు..? ఇప్పుడీ ప్రశ్నలన్నీ ప్రజల్లో మెదులుతున్నాయి.

    ఎప్పుడో మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రంలోకి కరోనా వైరస్‌ అడుగుపెట్టింది.. నెమ్మనెమ్మదిగా రాష్ట్రమంతటికి వ్యాపించింది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన వైరస్‌.. ఇప్పుడు గ్రామాల్లోనూ విజృంభిస్తోంది.  గత 24 గంటల్లో 2,2426 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కి చేరింది. 13 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 940కి చేరింది. ప్రస్తుతం 32,195 యాక్టివ్‌ కేసులుండగా.. 25,240 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

    ఇదిలా ఉండగా.. కరోనా కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.4,200 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్‌‌ చెబుతున్నారు. కానీ.. ఎక్కడా ఎంతెంత దేనికి ఖర్చు పెట్టారనేది విడుదల చేయడం లేదు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధుల మీద లెక్కలు చూపించాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తూనే ఉంది. కరోనా ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మరోవైపు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. మరోవైపు కరోనా కష్టకాలంలో చాలా మంది పెద్దలు రాష్ట్రానికి విరాళాలు ప్రకటించారు. కోట్లాది రూపాయల నిధులు సీఎంఆర్‌‌ఎఫ్‌కు బదిలీ చేశారు. అసలు అవి ఎన్ని వచ్చాయి..? వాటిలో నుంచి ఎన్ని ఖర్చు చేశారు..? ఇంకా ఎన్ని నిధులు ఉన్నాయి..? లెక్కలే వెల్లడించడం లేదు.

    Also Read : కేసీఆర్ కు జగన్ సపోర్టు చేస్తారా? చేయరా?

    రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద మాత్రం సవివరంగా చెప్పడం లేదు. ప్రతిపక్షాలు అసెంబ్లీ సాక్షిగా ఇటీవల డిమాండ్‌ చేసినా పెద్దగా కేసీఆర్ స్పందించలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కూడా కరోనా మీద నిలదీశారు. కరోనా మీద తాము అహర్నిషలు కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌‌ చెప్పుకొచ్చారే తప్ప.. వివరాలేమీ వెల్లడించలేదు. పాజిటివ్‌ రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించలేదు.

    మరోవైపు కరోనాను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నడో ఆరోగ్యశ్రీలో చేర్చింది. కానీ.. తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీలో చేర్చడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. నిత్యం ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నా స్పందించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇల్లు గుల్లా చేసుకుంటున్నాం మహాప్రభో అని వేడుకుంటున్నా ప్రభుత్వం చలనం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు తెలంగాణ సర్కార్‌‌ ఏమైనా వంతు పాడుతుందా అనే సందేహాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లోనూ అదే ప్రశ్న తలెత్తుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంది అని ప్రశ్నిస్తున్నారు.

    Also Read :  రగిలిన ‘విమోచనం’.. కేసీఆర్ ఎందుకు నిర్వహించరు?