యుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం

చైనా సైనికులు పదునైన కత్తులతో.. తుపాకులతో అవతలి సరిహద్దున కాచుకొని ఉన్నారు. భారత సైనికులు తొడగొడుతున్న ఈ క్రమంలోనే చైనా, భారత్ మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంది. తాజాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటి అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాల మంత్రులు నిర్ణయించారు. ఐదు అంశాల పట్ల అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. Also Read […]

Written By: NARESH, Updated On : September 11, 2020 3:21 pm
Follow us on

చైనా సైనికులు పదునైన కత్తులతో.. తుపాకులతో అవతలి సరిహద్దున కాచుకొని ఉన్నారు. భారత సైనికులు తొడగొడుతున్న ఈ క్రమంలోనే చైనా, భారత్ మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంది. తాజాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటి అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాల మంత్రులు నిర్ణయించారు. ఐదు అంశాల పట్ల అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.

Also Read :  ఈఎంఐ, రుణాల మీద కేంద్రం, ఆర్బీఐ వైఖరేంటి?

భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికతలు హీట్ పెంచుతున్నాయి. యుద్ధం అనివార్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఐదు అంశాల ప్రణాళిక ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి.

ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరిగి బలగాల ఉపసంహరణ జరగాలి. ఇరు దేశాల సైన్యాల మధ్య దూరం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇండియా చైనా బార్డర్ ఆఫైర్స్ కమిటీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు.

ఉద్రిక్తతలు తగ్గగానే ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించేలా చర్యలు వేగవంతం చేయాలని ఇరుదేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయంచారు.  ఈ మేరకు వివాదాలు విభేదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ, జిన్ పింగ్ ల మధ్య జరిగిన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ఐదు అంశాలను పటిష్టంగా అమలు చేసి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించారు. చైనా దీనికి కట్టుబడాలని భారత్ కోరింది. బలగాలు ఉపసంహరించాలని సూచించింది.

Also Read : చైనాకు ఇక వణుకే.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్