https://oktelugu.com/

Telangana Traffic Challan : వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..!!

https://echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి వాహనాల నంబర్‌ ఎంటర్‌ చేయగానే పెండింగ్‌ చనలాన్ల వివరాలు వస్తాయి.

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2024 / 07:53 PM IST
    Follow us on

    Telangana Traffic Challan : తెలంగాణలోని పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌ గడువు ఈరోజు రాత్రి 10 గంటలకు ముగియనుంది. గత డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1.14 కోట్ల చలాన్లు క్లియర్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఇప్పటి వరకు రూ.100.5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్‌ కాకా, వీటిద్వారా రూ.57.53 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా రూ.2.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    సర్వర్‌ సమస్యతో జాప్యం..
    ఇదిలా ఉండగా పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు సర్వర్‌ సమస్య ఆటంకంగా మారింది. బుధవారం చాలా మంది ఈ చలాన్‌ సైన్‌ ఓపెన్‌ చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో చలాన్లు చెల్లింపుకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో గడువు పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం గడువును ఈనెల 31 వరకు పొడిగింది. అంటే మరో 20 రోజులపాటు ఈచలాన్లు రాయితీపై చెల్లించవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వం 2022లో మార్చి 1 నుంచి 31 వరకు రాయితీ కల్పించింది. ఆ తర్వాత మరో 15 రోజులు గడువు పెంచింది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్‌ 26 నుంచి రాయితీ కల్పించింది. జనవరి 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దానిని తాజాగా జనవరి 31 వరకు పొడిగించింది. ఈలోపు వాహనాదారులు తమ పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేసుకోవాలని సూచించింది.

    డిస్కౌంట్లు ఇలా..
    గతనెల 26న ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. తమ వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని అనుకునేవారు https://echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి వాహనాల నంబర్‌ ఎంటర్‌ చేయగానే పెండింగ్‌ చనలాన్ల వివరాలు వస్తాయి.

    = పుష్‌ కార్ట్‌ల కోసం (39 B కేసులు) 10 శాతం చెల్లించాలి. 90 శాతం మినహాయింపు ఉంటుంది.
    = ఆర్‌టీసీ డ్రైవర్లకు 90 శాతం మినహాయింపు ఇవ్వగా.. 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
    = టూ వీలర్, త్రీ వీలర్‌కు 80 శాతం డిస్కౌంట్‌ ఇచ్చింది. 20 శాతం చెల్లించాలి.
    = కార్లు, ఇతర వాహనాదారులు 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 60 శాతం మినహాయించింది.