ఎగ్జిట్ పోల్స్: నాగార్జున సాగర్ లో గెలుపు వీరిదే?

దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. నాగార్జున సాగర్ అసెంబ్లీలో ‘పబ్లిక్ పల్స్ ’ సర్వే బయటకొచ్చింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 48.5శాతం ఓట్ల శాతం దక్కుతుందని సర్వే తేల్చింది.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి 43.8శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. కేంద్రంలో అధికారంలో ఉండి ఈ మధ్య తెలంగాణలో దూసుకొచ్చిన బీజేపీ మాత్రం సాగర్ లో తేలిపోతుందని తేలింది. మరీ తీసికట్టుగా కేవలం 4.5శాతం మాత్రమే వస్తాయని పబ్లిక్ పల్స్ సర్వే […]

Written By: NARESH, Updated On : April 29, 2021 7:05 pm
Follow us on

దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. నాగార్జున సాగర్ అసెంబ్లీలో ‘పబ్లిక్ పల్స్ ’ సర్వే బయటకొచ్చింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 48.5శాతం ఓట్ల శాతం దక్కుతుందని సర్వే తేల్చింది.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి 43.8శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.

కేంద్రంలో అధికారంలో ఉండి ఈ మధ్య తెలంగాణలో దూసుకొచ్చిన బీజేపీ మాత్రం సాగర్ లో తేలిపోతుందని తేలింది. మరీ తీసికట్టుగా కేవలం 4.5శాతం మాత్రమే వస్తాయని పబ్లిక్ పల్స్ సర్వే చెబుతోంది. ఇతర స్వతంత్రులకు 3.2శాతం ఓట్ల శాతం వస్తాయని తెలిపింది.

పబ్లిక్ పల్స్ సర్వే ప్రకారం.. తెలంగాణలోని నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని తేలిపోయింది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిస్తుందని సర్వే తేల్చింది. కాంగ్రెస్ తో హోరా హోరీగా తలపడి టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని పబ్లిక్ పల్స్ సర్వే తేల్చింది.

నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ నుంచి చనిపోయిన సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి ఓ వైద్యుడికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ బీజేపీ మేజిక్ ఏమాత్రం పనిచేయలేదని.. స్వతంత్రులకు వచ్చినన్ని ఓట్లు మాత్రమే వస్తాయని పబ్లిక్ పల్స్ సర్వే తేల్చింది.