https://oktelugu.com/

Lok Sabha Election 2024: ఎగ్జిట్‌ పోల్స్‌ Vs ఎగ్జాక్ట్‌ రిజల్స్‌.. 2019లో ఏం జరిగింది?

ఓట్ల లెక్కింపునకు ఇంకా మూడు రోజులు సమయం ఉండడంతో ఎగ్జిట్‌ పోల్సే ఎగ్జాక్ట్‌ పోల్స్‌ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 1, 2024 / 02:39 PM IST

    Lok Sabha Election 2024

    Follow us on

    Lok Sabha Election 2024: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ శనివారం(జూన్‌ 1)తో ముగియనుంది. ఆ తర్వాత సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిల్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న ప్రకటించనున్నారు. అయితే శనివారం సాయంత్రం వచ్చే ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఓట్ల లెక్కింపునకు ఇంకా మూడు రోజులు సమయం ఉండడంతో ఎగ్జిట్‌ పోల్సే ఎగ్జాక్ట్‌ పోల్స్‌ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. పలు ఏజెన్సీలు, మీడియా సంస్థలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయబోతున్నాయి.

    2019లో ఏం జరిగింది..
    మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్న నేపథ్యంలో 2019 ఎగ్జిట్‌ పోల్స్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నాటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమేరకు నిజమయ్యాయో పరిశీలిద్దాం. 2019 ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని స్పష్టంగా వెల్లడయింది. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. 2019లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీ పార్టీనే రికార్డు స్థాయిలో 303 స్థానాల్లో విజయం సాధించింది.

    సర్వే సంస్థల అంచనాలు.. ఫలితాలు ఇలా..
    – ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా..
    ఈ సంస్థ బీజేపీ నేతృత్తవలోని ఎన్‌డీఏ 339 నుంచి 365 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. యూపీఏకు 77 నుంచి 108 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు వచ్చాయి. ఈ సంస్థ దేశంలో 8 లక్షల మందని సర్వే చేసింది.

    – న్యూస్‌24– టుడేస్‌ చాణక్య
    ఈ సంస్థ సర్వే ఫలితాల్లో ఎన్డీఏ 350 సీట్లు గెలుస్తుందని తెలిపింది. ఇక యూపీఏ కూటమి 95 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఈ సర్వేకు దగ్గరగానే ఫలితాలు వచ్చాయి.

    – య్యూస్‌18–ఐపీఎస్‌ఓఎస్‌..
    ఈ సంస్థ కూడా తమ సర్వేలో ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు వస్తాయని తెలిపింది. యూపీఏకు 82 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతర పార్టీలకు 124 సీట్లు వస్తాయని తెలిపింది.

    – టైమ్స్‌నౌ–వీఎంఆర్‌..
    ఇక ఈ సంస్థ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 306 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, యూపీఏకు 132 సీట్లు వస్తాయని తెలిపింది.

    – ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌..
    ఈ సంస్థ కూడా ఎన్టీఏకే పట్టం కట్టింది. ఎన్డీఏకు 300 సీట్లు వస్తాయని తెలిపింది. యూపీఏకు 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇవి కూడా దాదాపు ఫలితాలకు దగ్గరగాన ఉన్నాయి.

    యూపీఏకు 90 స్థానాలు..
    ఇక 2019 ఎన్నికల్లో యూపీఏ కేవలం 90 స్థానాలకు పరిమితమైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మేరకు యూపీఏ కూటమికి సీట్లు వచ్చాయి. అయితే యూపీలో మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమి 49 సీట్లే గెలుస్తుందని చాలా సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో వెల్లడించాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏకంగా 64 స్థానాల్లో గెలిచింది. రాయ్‌బరేలీ సీటును ఎస్పీ గెలుచుకోగా, 10 స్థానాలు బీఎస్పీ–కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎస్సీ–బీఎస్సీ, ఆర్‌ఎల్‌డీలకు 29 సీఉ్ల వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్‌ కేవలం రెండ స్థానాల్లో గెలుస్తుందని తెలిపాయి.

    2014లో కూడా..
    ఇక 2014 ఎన్నికల్లో కూడా ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వలోని ఎన్డీఏకు 73 స్థానాలు వచ్చాయి. వాటిలో 71 స్థానాలు బీజేపీకి, 2 స్థానాలు అప్నాదళ్‌కు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్సీ, ఆర్‌ఎల్‌డీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలో దిగింది.