India GDP: మరింత వృద్ధిలోకి భారత్ జీడీపీ.. ఎన్ని పాయింట్లు పెరిగిందంటే?

2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అద్భుతమైన వేగంతో వృద్ధి చెందింది. ఎన్నికల ఫలితాలకు ముందు జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి.

Written By: Neelambaram, Updated On : June 1, 2024 2:34 pm

India GDP

Follow us on

India GDP: లోక్ సభ ఎన్నికల చివరి దశ ఉండానే ఆర్థిక వ్యవస్థకు శుభవార్త అందింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది.

2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అద్భుతమైన వేగంతో వృద్ధి చెందింది. ఎన్నికల ఫలితాలకు ముందు జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది, ప్పుడు 2024 ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధిని 8.2 శాతంగా అంచనా వేసింది.

స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) శుక్రవారం (మే 31) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024, మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా 6.9 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఇదే సమయంలో మే 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 648 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే 2 బిలియన్ డాలర్ల స్వల్ప క్షీణతను నమోదు చేసింది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంతో, 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతుంది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అన్ని అంచనాల కంటే మెరుగ్గా ఉంది.

ఇదే సమయంలో పరోక్ష పన్నులు, సబ్సిడీలు మినహాయించి స్థూల విలువ జోడింపు (జీవీఏ) 6.3 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంక కార్యాలయం నివేదించింది. ఎన్నికలకు ముందు బలమైన ఆర్థిక పని తీరును ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. భారత్ లో ఆరు వారాల పాటు జరిగిన ఎన్నికలు జూన్ 1న ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. నిర్మల్ బ్యాంగ్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఆర్థికవేత్త థెరిసా జాన్ మాట్లాడుతూ ‘జూన్ లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా భారత జీడీపీ వృద్ధి రేటు బలంగానే ఉంటుందని’ అన్నారు.