Bones Health: కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? ఇదిగో పరిష్కారం

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి సముద్రపు చేపలలో ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల వాపును తగ్గించి.. అదనంగా విటమిన్ డి ని, శరీరానికి కావాల్సిన కాల్షియంను అందిస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 1, 2024 2:44 pm

Bones Health

Follow us on

Bones Health: వయసుకు ముందే కీళ్ల నొప్పులు మొదలు అవుతున్నాయి. మహిళల్లో మాత్రమే కాదు పురుషులో కూడా ఈ సమస్య మరింత ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం కుషన్ అంటారు నిపుణులు. కీళ్లలోని కుషన్ కోతకు గురవుతుందట. దీని వల్లనే నొప్పి తీవ్రం అవుతుందట. ఇక కీళ్ల నొప్పులు పెరిగితే చాలు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ నొప్పి మందులను తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. నొప్పి నివారణ మందులు తీసుకునే కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి సముద్రపు చేపలలో ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల వాపును తగ్గించి.. అదనంగా విటమిన్ డి ని, శరీరానికి కావాల్సిన కాల్షియంను అందిస్తాయి. వీటి వల్ల బలమైన ఎముకలు మీ సొంతం అవుతాయి. ఇవే కాదు బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఇ, విటమిన్ సి లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తుంటాయి. వాపును తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.

బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు వంటి నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి కూడా వాపును తగ్గించడంలో ఉత్తమంగా పని చేస్తాయి. మీ రోజువారీ ఆహారంలో అల్లం, వెల్లుల్లిని కచ్చితంగా చేర్చుకోవాలి. వీటి వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రెండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు. శరీరంలో వచ్చే మరిన్ని నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఇక ఇవి మాత్రమే కాదు కాల్షియం లభించే అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, బెర్రీలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో మరింత ఎక్కువ సహాయం చేస్తాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా కీళ్ల వాపులను తగ్గిస్తాయి అంటున్నారు నిపుణులు.