https://oktelugu.com/

ఈటల పార్టీకే ఓటు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం మొదలైనట్లే. పార్టీ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారని తెలిసింది. దీంతో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఈటల రాజేందర్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారు. నూరు ఆరైనా పార్టీ ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే దానిపై ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. జిల్లాల వారీగా నేతల లిస్టు తయారు చేసి వారికి ఏ రకమైన బాధ్యతలు అప్పగించాలనే దానిపై […]

Written By: , Updated On : May 9, 2021 / 03:16 PM IST
Follow us on

Etela Rajenderమాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం మొదలైనట్లే. పార్టీ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారని తెలిసింది. దీంతో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఈటల రాజేందర్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారు. నూరు ఆరైనా పార్టీ ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే దానిపై ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. జిల్లాల వారీగా నేతల లిస్టు తయారు చేసి వారికి ఏ రకమైన బాధ్యతలు అప్పగించాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మాటకు కట్టుబడి
ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు నడిచే నేతల్లో ఈటల రాజేందర్ ముందుంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ పెట్టడానికే నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అసంతృప్త నేతలను తమ దారికి తెచ్చుకుని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలతో నడిచేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పార్టీపై పలువురు ముందుకు వస్తున్నారు.

ఈటల నాయకత్వంపై..
ఈటల రాజేందర్ కొత్త పార్టీ వ్యవహారంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. ఈటల పార్టీలో చేరితే బిందాస్ అనే అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తుపై ఆశలతోనే ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. ఈటల పార్టీతోనే సమాధానం చెబుతారని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ద్వితీయ శ్రేణి నాయకులే..
ద్వితీయశ్రేణి నేతలతోనే పార్టీ కూర్పు ఉంటుందని సమాచారం. పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవులు పొందని వారిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. దీంతో పార్టీ విధానాలు, బాధ్యతలను త్వరల ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాయకత్వ పటిమ ఉన్న వారిని గుర్తించి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది.