CM Jagan: అంతా రివర్స్.. సీఎం జగన్ ‘ముందుగానే’ మేల్కొంటున్నారా?

CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రెండున్నేళ్లు కావొస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు నిర్ణయాలతో ముందుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. ‘మాటతప్పను.. మడమ తిప్పను’ అనే స్థాయి నుంచి రెండున్నరేళ్లలో అనేక నిర్ణయాలను అనుహ్యంగా వెనక్కి తీసుకుంటూ సీఎం జగన్ తన ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రెండున్నరేళ్ల పాలనను పూర్తి […]

Written By: NARESH, Updated On : December 20, 2021 11:22 am
Follow us on

CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రెండున్నేళ్లు కావొస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు నిర్ణయాలతో ముందుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. ‘మాటతప్పను.. మడమ తిప్పను’ అనే స్థాయి నుంచి రెండున్నరేళ్లలో అనేక నిర్ణయాలను అనుహ్యంగా వెనక్కి తీసుకుంటూ సీఎం జగన్ తన ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు.

Andhra Pradesh CM

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈమేరకు గతంలో తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సమీక్షించుకున్నారు. ఈక్రమంలోనే పలు కీలక బిల్లులు, నిర్ణయాలను వెనక్కి తీసుకునేందుకు జగన్ సర్కార్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

తొలినాళ్లలో చూపించిన దూకుడును జగన్ సర్కార్ ఇప్పుడు చూపించడం లేదు. అంతా ఆచితూచి వ్యవహరిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీకే ప్రజలు పట్టం కడుతున్నాయి.  ఈ ట్రెండ్ వచ్చే ఎన్నికలకు ఇలానే కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు.

అయితే కొన్నివర్గాల్లో సర్కారుపై వ్యతిరేకత వచ్చిందనే రిపోర్టులు జగన్ కు అందినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు వైసీపీ కీలక కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఏమాత్రం వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత తగ్గించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లడం ద్వారా వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

ఈనేపథ్యంలోనే మూడు రాజధానుల రద్దు నిర్ణయం నుంచి మద్యం ధరల తగ్గింపు, శాసన మండలి రద్దు వెనక్కి తీసుకోవడం లాంటి నిర్ణయాలను జగన్ సర్కారు ఇటీవల తీసుకుంటోంది. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉంటామని జగన్ సర్కారు చెబుతున్నారు.

మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా గతంలో ప్రవేశపెట్టిన బిల్లులో పలుమార్పులు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి ప్రాంతంలో రైతులను సంతృప్తిపరిచేలా కొత్త బిల్లు ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. తద్వారా అన్ని ప్రాంతాలను కలుపుకుపోవాలని జగన్ భావిస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం పేరిట అమాంతం ధరలను పెంచేశారు. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్న వర్గాల్లో ఈ సెక్షన్ కూడా ఒకటి. అయితే మద్యం ధరల పెంపుతో రోజువారీ కూలీలు, ఇతర వర్గాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది.

పేరుతెలియని బ్రాండ్లతో తమ ఆరోగ్యాన్ని ప్రభుత్వం చెడగొడుతుందనే భావన మద్యంప్రియుల్లో కన్పిస్తుంది. వీరిని సంతృప్తి పరిచేలా సీఎం జగన్ ఇటీవల మద్యం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. అలాగే శాసన మండలి రద్దును కూడా జగన్ సర్కారు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: Minister Balineni: సొంత పార్టీ మంత్రి బాలినేని అనుచరుడిపై వైసీపీ నేతల దాడి.. అసలేమైదంటే?

జగన్ ను నమ్ముకునే చాలామంది నేతలున్నారు. వారందరికీ పదవులు కట్టబెట్టాలంటే శాసనమండలి ఉండాల్సిందే. ఈ కారణాలతోనే సీఎం గడిచిన రెండున్నేళ్లలో అనేక కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు.వీటితోపాటు ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో కొన్ని సర్వేలు చేపడుతోంది.

వీటి ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరికొన్ని నిర్ణయాలను సీఎం జగన్ వెనక్కి తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడమే లక్ష్యంగా జగన్ ముందస్తుగానే మెల్కోంటున్నారు. అయితే వరుసగా ఇలా కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుండటం జగన్ ఇమేజ్ ను మసకబారుస్తుందనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.

Also Read: Chandrababu: అభ్యర్థుల కోసం చంద్రబాబు వెతుకులాట