https://oktelugu.com/

Movie tickets: మూవీ టికెట్స్‌పై ఏపీ సర్కారు కీలక నిర్ణయం..

Movie tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం అంశంలో మరో అడుగేసింది. ఇకపై సర్కారు ద్వారానే టికెట్స్ ఆన్ లైన్ కొనుగోలు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఏపీ సర్కారు జీవో నెం.142 జారీ చేసింది. గత కొంత కాలంలగా ఏపీ ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంపై టాలీవుడ్ సినీ పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఆన్ లైన్ టికెటింగ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 20, 2021 / 09:56 AM IST
    Follow us on

    Movie tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం అంశంలో మరో అడుగేసింది. ఇకపై సర్కారు ద్వారానే టికెట్స్ ఆన్ లైన్ కొనుగోలు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఏపీ సర్కారు జీవో నెం.142 జారీ చేసింది. గత కొంత కాలంలగా ఏపీ ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంపై టాలీవుడ్ సినీ పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

    movie tickets

    ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకొచ్చేందుకుగాను ఏపీ సర్కారు ఇటీవల అసెంబ్లీలో చట్ట సవరణ కూడా చేసింది. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఏపీ ఎఫ్‌డీసీకి అప్పగిస్తున్నట్లు జీవోలో తెలిపింది. ఇకపై జనాలు ఏపీ ఎఫ్ డీసీ ద్వారానే టికెట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్‌ను రూపొందిస్తున్నారు.

    సినిమా టికెట్స్ అమ్మకాల విషయంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఏపీ సర్కారు ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంటోంది. ఇక ఈ నూతన వెబ్ సైట్‌లో థియేటర్స్ లో విడుదలైన సినిమాలతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ఆ వెబ్ సైట్ కు వెళ్లి లేదా యాప్ ద్వారానైనా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

    Also Read: Minister Balineni: సొంత పార్టీ మంత్రి బాలినేని అనుచరుడిపై వైసీపీ నేతల దాడి.. అసలేమైదంటే?

    ఈ సంగతులు ఇలా ఉంటే ఏపీ సర్కారు సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇటీవల జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం థియేటర్స్ లో టికెట్స్ ధరలను నిర్ణయించడాన్ని తప్పుబడుతూ థియేటర్స్ యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేయగా, ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. పాత పద్ధతిలోనే థియేటర్స్ ఓనర్స్ టికెట్స్ అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే థియేటర్స్ ముందుగా సంబంధిత జేసీకి అప్లికేషన్ చేసిన తర్వతనే టికెట్స్ ప్రైసెస్ పెంచుకోవాలని, అలా టికెట్స్ ప్రైసెస్ పెంపునక కమిటీని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సింగిల్ జడ్జితో ఉన్న బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దాంతో దానిపై సోమవారం డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది.

    Also Read: Niti Aayog: ఏపీకి ఊహించని రిప్లై ఇచ్చిన నీతి అయోగ్..

    Tags