https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: సన్నీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడని ముందే అనుకున్న… తల్లి కళావతి

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంత గ్రాండ్ గా ప్రారంభం అయ్యిందో అంతే గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ ఐదులో విజేతగా బుల్లితెర నటుడు సన్నీ నిలిచాడు. తనదైన శైలిలో ప్రతిభ కనబరుస్తూ ఆసాంతం ఆకట్టుకున్నాడు. వంద రోజులకుపైగా జరిగిన షోలో విక్టరీ సొంతం చేసుకుని విన్నర్ గా నిలిచాడు సన్నీ. కాగా ఈ తరుణంలో తన తనయుడు విజయంపై సన్నీ తల్లి కళావతి హర్షం వ్యక్తం చేశారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 09:47 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంత గ్రాండ్ గా ప్రారంభం అయ్యిందో అంతే గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ ఐదులో విజేతగా బుల్లితెర నటుడు సన్నీ నిలిచాడు. తనదైన శైలిలో ప్రతిభ కనబరుస్తూ ఆసాంతం ఆకట్టుకున్నాడు. వంద రోజులకుపైగా జరిగిన షోలో విక్టరీ సొంతం చేసుకుని విన్నర్ గా నిలిచాడు సన్నీ. కాగా ఈ తరుణంలో తన తనయుడు విజయంపై సన్నీ తల్లి కళావతి హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు బిగ్ బాస్ షోలో తను గెలుస్తాడని తాను అనుకున్నట్లు చెప్పారు. చివరికి తన కల నిజమైందన్నారు.

    Bigg Boss 5 Telugu Winner VJ Sunny and His Mother Kalavthi

    అంతేకాదు సన్నీ చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేవాడని… కష్టపడి పనిచేసే తత్వం తన కొడుకు సొంతం అన్నారు. నటుడిగా సీరియల్ లో తనను తాను నిరూపించుకున్నాడని చెప్పారు. అయితే నటుడుగా బుల్లి తెరమీద అడుగు పెట్టకముందు… సన్నీ రిపోర్టర్‌గా పనిచేశాడని గుర్తు చేసుకున్నారు కళావతి.

    Also Read:  బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు.? అసలు కారణాలేంటి?

    బిగ్ బాస్ సీజన్ ఐదులో విన్నర్ గా నిలిచి హీరో నాగార్జున చేతుల మీదుగా సన్నీ కప్పు అందుకుంటున్న సమయంలో తాను తల్లిగా ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు తెలిపారు. కప్పు తీసుకునే సమయంలో తనను వేదికపైకి ఆహ్వానించినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందన్నారు. సన్నీ ఈ సీజన్ లో విజేతగా నిలిచి రెమ్యునరేషన్‌తో పాటు టైటిల్‌ విన్నర్ ప్రైజ్ మనీ . 50 లక్షల సహా ఇతర బహుమతులను కలుపుకుని కోటికిపైగానే అందుకున్నాడని తెలుస్తోంది. ఇక రన్నరప్ గా షణ్ముఖ్, మూడో ప్లేస్ లో శ్రీరామ్ నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read:  ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?