Chiranjeevi Mohan Babu: హిట్లర్ సినిమాకు మోహన్ బాబును అనుకున్నారు…కానీ చిరంజీవి నటించాడు : అసలేం జరిగిందంటే..?

Chiranjeevi Mohan babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మెగాస్టార్ ఇప్పటికీ టాలీవుడ్ లో అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. అయితే చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. 150కి పైగా నటించిన ఆయన సినిమాల్లో హిట్లు, ఫట్లు ఉన్నాయి. చిరంజీవి కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా హిట్లర్. అప్పటి వరకు యంగ్ డైనమిక్ హీరోగా నటించిన చిరు ఇందులో మాత్రం బాధ్యతాయుతమైన […]

Written By: NARESH, Updated On : December 5, 2021 12:09 pm

hitler-movie

Follow us on

Chiranjeevi Mohan babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మెగాస్టార్ ఇప్పటికీ టాలీవుడ్ లో అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. అయితే చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. 150కి పైగా నటించిన ఆయన సినిమాల్లో హిట్లు, ఫట్లు ఉన్నాయి. చిరంజీవి కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా హిట్లర్. అప్పటి వరకు యంగ్ డైనమిక్ హీరోగా నటించిన చిరు ఇందులో మాత్రం బాధ్యతాయుతమైన వ్యక్తిగా నటించాల్సి వచ్చింది. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Chiranjeevi Mohan Babu

అయితే ఈ సినిమా రాకముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1997 జనవరి 4న హిట్లర్ సినిమా విడుదలయింది. అంతకుముందు 1996లో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అయితే మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాను ఎడిటర్ మోహన్ హక్కులు చేజిక్కించుకున్నారు. ఆ తరువాత తెలుగులో రీమేక్ చేసేందుకు హీరోగా ముందుగా మోహన్ బాబును అనుకున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ గా ఇవివి సత్యనారాయణగా పెడతామనుకున్నారు.

Hitler Movie

అయితే ఇవివి సత్యానారాయణకు ఈ స్టోరీని చెప్పగా ఆయన ఒప్పుకోలేదట. దీంతో ఆయన స్థానంలో ముత్యాల సుబ్బయ్యను అనుకున్నారు. అప్పటికే ముత్యాల సబ్బయ్య డైరెక్షన్లో మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి. దీంతో ఆయన ఈ సినిమా తీయగలడని అనుకుని ఆ బాధ్యతలను సుబ్బయ్యకు అప్పగించారు. అనుకున్నట్లుగానే సినిమాను తీర్చి దిద్దారు. సినిమా స్టోరీ, యాక్టర్లను అనుకున్న రీతిలో పెట్టి అద్భుతంగా సెట్ చేశారు.

Chiranjeevi Mohan Babu

Also Read: Kamal Haasan Sridevi: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

ఇక బిగ్ బాస్ సినిమాతో ప్లాప్ తెచ్చుకున్న చిరంజీవి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా మోహన్ బాబును హీరోగా అనుకున్నా.. ఆ తరువాత చిరంజీవిని కలిశారు. దీంతో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న చిరుకు ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. అలా హిట్లర్ సినిమా 1997లో రిలీజ్ అయింది. ఇది మంచి సినిమాగానే కాకుండా, కమర్షియల్ గా కూడా సక్సెస్ ఫుల్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో చిరు కొత్తగా కనిపించడంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు.

Also Read: Mahesh Babu: హీరోగా ఎంట్రీ… మహేష్ ని వెంటాడిన భయం

Chiranjeevi Mohan Babu

Tags