Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ గెలుస్తామనే ధీమా రెండు పార్టీలో కనిపించింది. కానీ సంక్షేమ పథకాలు, దళితబంధు, కుల సంఘాల భవనాల నిర్మాణాలకు హామీ వంటి అంశాలను బేరీజు వేసుకొని తమదే విజయం అంటూ టీఆర్ఎస్ మొదటి నుంచీ చాలా గట్టిగానే చెబుతూనే వస్తోంది. కానీ ఫలితాలు మాత్రం మొదటి నుంచీ బీజేపీకి అనుకూలంగా రావడం టీఆర్ఎస్ పార్టీ నాయకులను కలవరపెడుతోంది.

ఈరోజు ఉదయం 9 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ ఫలితం మాత్రమే టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చింది. మొత్తం 753 ఓట్లు ఉంటే.. 455 ఓట్లు టీఆర్ఎస్‌కు వచ్చాయి. బీజేపీకి 242, కాంగ్రెస్ అభ్యర్థికి 2 ఓట్లు వచ్చాయి. తరువాత ఈవీఎంల ఓట్లు కౌంటింగ్ మొదలు పెట్టారు. ఈ ఫలితం నుంచి ఈటల ముందంజలో ఉంటూ వస్తున్నారు. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 4444 ఓట్లు రాగ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 4610 ఓట్లు వచ్చాయి. అంటే గెల్లు కంటే ఈటల 166 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇక అప్పుడు ప్రారంభమైన ఈటల ప్రభంజనం వరుసగా 7వ రౌండ్ వరకు కొనసాగింది.
రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4659 , బీజేపీకి 4851, మూడో రౌండ్లో టీఆర్ఎస్‌కు 3159, బీజేపీకి 4064, నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3882, బీజేపీకి 4444, ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4014, బీజేపీకి 4358, ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3639, బీజేపీకి 4656, ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3792, బీజేపీకి 4038 ఓట్లు వచ్చాయి.
ఇక 8వ రౌండ్ ఫలితాలు వచ్చే సరికి లీడ్ తారుమారు అయ్యింది. 8వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్‌కు 4248 ఓట్లు, బీజేపీకి 4086 ఓట్లు వచ్చాయి. అంటే అప్పటి వరకు ముందంజలో వస్తూ వచ్చిన బీజేపీ కంటే టీఆర్ఎస్ 162 ఓట్ల లీడ్‌లోకి వచ్చింది. మళ్లీ 9వ రౌండ్‌లో ఈటల ప్రభావం మొదలైంది. 9వ రౌండ్‌లో టీఆర్ఎస్ 3470, బీజేపీ 5305, 10వ రౌండ్‌లో టీఆర్ఎస్ 3709, బీజేపీ 4295కి వచ్చాయి. మళ్లీ 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 4326 ఓట్లు రాగా..బీజేపీకి 3941 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్‌లో కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ లీడ్ లోకి వచ్చారు. ఆయనకు ఈ రౌండ్‌లో 385 ఓట్ల మెజారిటీ ఓట్లతో ఉన్నారు.
Also Read: Captain Laxmikanth: కెప్టెన్ ప్రభావం కూడా పనిచేయలే.. అక్కడ బీజేపీదే లీడ్
మళ్లీ 12వ రౌండ్‌లో ఈటల మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3632, బీజేపీకి 4849 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2971, బీజేపీకి 4836 ఓట్లు వచ్చాయి.14వ రౌండ్ లో టీఆర్ఎస్‌కు 3700, బీజేపీకి 4746 ఓట్లు వచ్చాయి. ఇలా ప్రతీ దాదాపు ప్రతీ రౌండ్‌లో మొదటి నుంచి ఈటెల ప్రభంజనం కనిపిస్తూ వచ్చింది. ఇదే ప్రభావం రాబోయే 9 రౌండ్లలో కనిపించే అవకాశం ఉంది. మరి మిగితా ఫలితం ఎలా ఉండబోతుందో ఎదురుచూడాల్సి ఉంది. ఏది ఏమైనా గెలుపు ఓటములు మాత్రం చాలా తక్కువ ఓట్ల మెజారిటీతోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Komatireddy: ఈటలను కాంగ్రెస్ గెలిపించిందా? కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు