Badvel byelection: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ విజయదుందుభి మోగించింది. పోలింగ్ ఏకపక్షంగా సాగింది. బ్రహ్మాండమైన మెజార్టీ సాధించింది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్థి పార్టీలు చిత్తయ్యాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ సాధించడం విశేషం. బద్వేల్ లో అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి సుధకు టికెట్ కేటాయించింది. గత నెల 30న ఎన్నిక జరిగింది. నేడు ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోటీలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయాయి.

వైసీపీ అభ్యర్థి సుధ తన సమీప బీజేపీ ప్రత్యర్థి పనతల సురేష్ పై 90 వేల భారీ మెజార్టీ సాధించింది. దీంతో పోలింగ్ మొత్తం ఏకపక్షంగా సాగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపించాయని వైసీపీ నేతలు చెబుతుంటే బీజేపీ నేతలు మాత్రం అధికార పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని విమర్శలు చేస్తున్నారు. నైతిక విజయం తమదేనని చెబుతున్నారు. వైసీపీకి రాబోయే రోజుల్లో కాలం చెల్లడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సైతం అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు పాల్పడిందని గుర్తు చేయడం గమనార్హం. వైసీపీ పతనం రాబోయే ఎన్నికల్లో ఖాయమని జోస్యం చెబుతున్నారు. అధికారం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని చెప్పడం చూస్తుంటే బద్వేల్ లో దొంగ ఓట్లు పడ్డాయని బీజేపీ నేతలు చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Captain Laxmikanth: కెప్టెన్ ప్రభావం కూడా పనిచేయలే.. అక్కడ బీజేపీదే లీడ్
2024 ఎన్నికల్లో వైసీపీకి అపజయం తప్పదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బద్వేల్ లో దొంగ ఓట్లు వేయించి రిగ్గింగ్ కు పాల్పడి అధికార పార్టీ తప్పు చేసిందని పేర్కొంటున్నారు. ఇప్పటి నుంచే వైసీపీ పరాజయం కౌంట్ డౌన్ మొదలైందని చెబుతున్నారు. వైసీపీ నేతల అక్రమాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెలుస్తోంది.
Also Read: Komatireddy: ఈటలను కాంగ్రెస్ గెలిపించిందా? కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు