EPFO : ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత గల సంస్థ ఈపీఎఫ్ఓ. ఉద్యోగులు ప్రతినెల తాము పొదుపు చేసిన పొదుపులో కొంత భాగాన్ని వివాహం, ఉన్నత విద్య లేదా ఇంటి కొనుగోలు, అనారోగ్యం, నిరుద్యోగం వంటి పలు ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్ విత్ డ్రా చేస్తూ ఉంటారు. కానీ పొదుపు చేసినా మొత్తంలో ఎంత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు చాలామందికి తెలియదు. పిఎఫ్ ను నిరుద్యోగం, పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, ఇల్లు నిర్మించడం ఇక చివరిగా ఉద్యోగ విరమణ చేసినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ వీటన్నిటిలో పొదుపు చేసిన పూర్తి మొత్తం డబ్బులను కేవలం రిటైర్డ్ అయిన తర్వాత మాత్రమే పొందగలుగుతారు. మిగిలిన సందర్భాలలో మీరు పొదుపు చేసిన పిఎఫ్ లో కొంత మొత్తం మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉద్యోగం మానేసినట్లయితే ఉద్యోగం మానేసిన నెల రోజుల తర్వాత పిఎఫ్ లో మీరు పొదుపు చేసిన మొత్తంలో 75% విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
Also Read : సామాన్యుల కోసం EPFO కొత్త రూల్స్.. ఉద్యోగుల ఖాతాల్లో భారీగా డబ్బులు..
ఆ వ్యక్తి రెండు నెలలు కంటే ఎక్కువగా నిరుద్యోగిగా ఉన్నట్లయితే మిగిలిన బ్యాలెన్స్ ని కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. పదవ తరగతి తర్వాత తమ పిల్లల ఉన్నత చదువుకు మీరు దాచుకున్న ఈపీఎఫ్ నుంచి 50% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ఇంటి పునరుద్ధరణ సమయంలో కూడా ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ ఇల్లు కట్టి కనీసం ఐదు ఏళ్లపైన అయి ఉంటే కనుక వారు 68b (7) కింద గృహ పునరుద్ధరణకు తమ పిఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఇల్లు నిర్మించి ఐదేళ్ల లోపు అయ్యి ఉంటే వాళ్లు టాక్స్ లకు లోబడి పిఎఫ్ నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి వారికి 50 వేల కంటే టీడీఎస్ ఎక్కువ ఉండదు. వారి పిల్లల పెళ్లి లేదా పిఎఫ్ ఖాతాదారుడు స్వయంగా పెళ్లి చేసుకున్నట్లయితే పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి వారికి 50 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారిన సమయంలో ఖాతాదారుడు తమ పొదుపును పీఎఫ్ ఖాతా నుంచి పొదుపు విత్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి సమయంలో సంబంధిత ఫారంలను సబ్మిట్ చేసి డబ్బులను బదిలీ చేసుకోవచ్చు. చివరిగా ఉద్యోగి పదవి విరమణ సమయంలో మొత్తం పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
Also Read : ఈపీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బీమా కవరేజీ!