EPFO
EPFO: ఈపీఎఫ్(Employee Provident Fund) అనేది భారతదేశంలో ఉద్యోగస్తుల కోసం ఒక పొదుపు పథకం. ఇది ఉద్యోగుల జీతాలలో కొంత భాగం కొంత భాగం ఆ ఉద్యోగి ఉద్యోగి ప్రస్తుత నిరంతర కార్యాలయ ప్రకారం వారి EPF ఖాతాలో ఆమోదించబడుతుంది. ఇది వారి ఉద్యోగ కాలం గడిచిన తర్వాత రిటైర్ అవడానికి మరియు ఇతర అత్యవసర అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ పథకం ప్రతి ఉద్యోగికి మేలు చేకూర్చడానికి రూపొందించబడింది. ఇది ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కొరకు ఒక పొదుపు సాధనంగా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యులుగా ఉన్న ప్రైవేటురంగ ఉద్యోగులకు జీవిత బీమా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకం అమలు చేస్తారు.
ఈడీఎస్‌ఐ స్కీమ్ వివరాలు
– ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు 15 వేల వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగుల ఈ స్కీంలో డీపాల్ట్(Defalt)గా చేరతారు.
– ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5 శాతం యజమానులు ఈడీఎస్‌ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతతన పరిమితి రూ.15 వేలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈడీఎల్‌ఎస్‌ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు.
– ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా 15 వేలకు లోబడి ఈ బెనిఫిట్ లెక్కిస్తారు.
–కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది.
గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్
ఈడీఎస్‌ఐ పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమ చేయాలి. అయితే దీనికంటే మెరుగైన ఇన్సూరెన్స్(Insurance) పాలసీలు ఏమైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీంను ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎస్‌ఐఐ స్కీం ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి.
ఎలా క్లెయిమ్ చేయాలి?
ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు అందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్‌వోకు సమర్పించాలి. క్లెయిమ్స్ మినీ ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ లేదా ఈపీఎఫ్‌వో కార్యాలయం నుంచి ఫాం5 ఐఎఫ్(ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతోపాటు అవసరమైన వివరాలు ఫారంలో నింపి కార్యాలయంలో సమర్పించాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Good news for epfo members free insurance coverage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com