War 2 : ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2′(War2 Movie) చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో మొదలైన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఆగస్టు 14 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, అదే సమయంలో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన స్క్రీన్ టైం దాదాపుగా 90 నిమిషాలకు పైగానే ఉంటుందట. కియారా అద్వానీ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మొదలైనట్టు తెలుస్తుంది.
Also Read : వార్ 2′ లో 20 నిమిషాలు ఎన్టీఆర్ అలా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ కి పండగే!
ముందుగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, మేము అధికారికంగా చెప్పే వరకు ఇలాంటివి నమ్మొద్దు అంటూ నాగవంశీ రీసెంట్ గానే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసాడు. అయితే దేవర చిత్రం సమయంలో కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యినప్పుడు కూడా నాగవంశీ ఇదే విధంగా స్పందించాడు. కానీ చివరికి ఆయనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ని కొనుగోలు చేసినట్టు అధికారిక ప్రకటన చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్మటు ని అనుసరిస్తున్నట్టు ఉన్నాడు. బిజినెస్ గురించి ఇప్పటి నుండే చర్చలు బయ్యర్స్ తో జరుగుతున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతం మొత్తానికి ఈ సినిమా 35 కోట్ల రూపాయలకు డీల్ ముగిసినట్టు తెలుస్తుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి.
ఎందుకంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు కోస్తాంధ్ర ప్రాంతం నుండి 70 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘హరి హర వీరమల్లు’ అయితే వంద కోట్ల రూపాయలకు బిజినెస్ పలుకుతుంది. మిగిలిన హీరోల పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఇదే రేంజ్ బిజినెస్ పలుకుతుంది. వాటితో పోలిస్తే చాలా తక్కువే కదా. ఓవరాల్ గా నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ప్రాంతాలకు కలిపి 85 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. సోలో హీరో గా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఎన్టీఆర్ లాంటి హీరో సినిమాకు ఇంత తక్కువ బిజినెస్ జరగడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అయితే ఇది ఎన్టీఆర్ మెయిన్ లీడ్ సినిమా కాదు కాబట్టే, ఇంత తక్కువ బిజినెస్ జరుగుతుందని అభిమానులు అంటున్నారు.
Also Read : ఎన్టీయార్ కి వార్ 2 సినిమాతో వరుసగా 8 వ సక్సెస్ దక్కుతుందా..?