‘ధరణి’లో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి..

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత రెవిన్యూ యాక్ట్ ను రద్దుచేసి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములను ప్రతీఒక్కరు ‘ధరణి’ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.ధరిణిలో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ ధరణిలో ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ అధికారులు ఇళ్లకు వస్తుండటంతో […]

Written By: NARESH, Updated On : October 3, 2020 8:00 pm
Follow us on

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత రెవిన్యూ యాక్ట్ ను రద్దుచేసి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములను ప్రతీఒక్కరు ‘ధరణి’ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.ధరిణిలో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ ధరణిలో ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ అధికారులు ఇళ్లకు వస్తుండటంతో ఎక్కడ కరోనా సోకుతుందోననే ఆందోళన ప్రతీఒక్కరిలో వ్యక్తం అవుతోంది.

Also Read: సంచలనం: సొంత కమాండర్‌‌నే చంపిన మావోయిస్టులు

ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. ప్రజలే తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసుకునేలా పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ధరణి పోర్టల్ ను మీసేవాకు లింకు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతానికి మీసేవా లింకు అందుబాటులో రాలేదు. మరో రెండుమూడ్రోజుల్లో మీసేవాకు ధరణిని అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది.

పౌరులు ఆన్ లైన్లో తమ ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నట్లయితే ధరణి పోర్టల్‌తోపాటు.. సంబంధింత కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా తెలుస్తుంది. దీంతో మీ ఇల్లు/భవనం వద్దకు సిబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఆన్‌లైన్లో నమోదు చేసిన ఆస్తుల వివరాల సేకరణకు సిబ్బంది దాదాపుగా వెళ్లరు. సమాచారలోపంతో వెళ్లినా.. అప్పటికే నమోదు చేశామని సంబంధిత యజమానులు చెబితే వెనుతిరుగుతారని అధికారులు చెబుతున్నారు.

మీసేవాలో ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాల్సిన వారు ఈ క్రింది లింకులో వెళ్లాల్సి ఉంటుంది. http://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/User Interface/Citizen/RevenueServices/SMSSendOTP.aspx ఓపెన్‌ చేసి అందులో అడిగిన ప్రకారం వివరాలను నమోదు చేసు చేయాల్సి ఉంటుంది. చివరగా అన్ని పరిశీలించుకున్నాక ఫైనల్‌గా సేవ్‌ చేయాలి.

Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

అయితే ధరణిలో ఇంటి ఆస్తులు నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. తమ తండ్రులు, తాతలపై ఆస్తులు ఉండి వారు గతంలో చనిపోయి ఉంటే వారి వివరాలను అధికారులు ధరణిలో నమోదు చేయడంలేదు. ఇలాంటివే రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే ధరణి వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!