https://oktelugu.com/

సంచలనం: సొంత కమాండర్‌‌నే చంపిన మావోయిస్టులు

ప్రజల సమస్యలపై.. ప్రజల కోసం పోరాడే మావోయిస్టులు ఇప్పుడు సొంత కమాండర్‌‌నే హతమార్చడం చర్చనీయాంశమైంది. బస్తర్ రేంజ్‌ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఓ పక్క మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట సాగిస్తున్న వేళ మావోయిస్టులే ఇలా కమాండర్‌‌ను హతమార్చడం గమనార్హం. Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..? ఐజీ వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో ఈ మధ్య కాలంలో ఆదివాసీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 8:05 pm
    Follow us on

    ప్రజల సమస్యలపై.. ప్రజల కోసం పోరాడే మావోయిస్టులు ఇప్పుడు సొంత కమాండర్‌‌నే హతమార్చడం చర్చనీయాంశమైంది. బస్తర్ రేంజ్‌ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఓ పక్క మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట సాగిస్తున్న వేళ మావోయిస్టులే ఇలా కమాండర్‌‌ను హతమార్చడం గమనార్హం.

    Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

    ఐజీ వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులను మావోయిస్టులు హత్యలు చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మావోయిస్టు అగ్రనాయకత్వం దండకారణ్యం జోన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. హత్య ఘటనల వెనుక పూర్వాపరాలు శోధించి ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం స్థానిక డివిజన్ ఏరియా కమిటీ ఇన్‌చార్జి, కమాండర్ విజా మోడియం అలియాస్ బద్రును దోషిగా నిర్ధారించింది. గ్రామస్తుల హత్యలు ఉద్దేశ్య పూర్వకంగానే బద్రు ఏకపక్షంగా సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడైంది.

    మావోయిస్టు నాయకుడు, డివిసి ఇంచార్జ్ గంగులూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు వయసు 34 సంవత్సరాలు. అతను బీజాపూర్ జిల్లా గంగులూరు సమీపంలోని మంకెలి గ్రామస్థుడు. మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ సభ్యుడు కూడా.

    Also Read: మారిటోరియంలో వడ్డీపై వడ్డీ మినహాయింపు.. రుణగ్రహీతలకు ఊరట..!

    తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని చంపాడనే అభియోగంతో మావోయిస్టులు తమ సొంత కమాండర్‌నే హతమార్చారని సమాచారం. మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా పేరు గాంచిన విజాను గంగులూరు మరియు కిరాండుల్ మధ్య ఎటావర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచారం. మావోయిస్టులు విజాను హతమార్చిన అనంతరం అర్ధరాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా తెలిసింది. సొంత గ్రామం మంకెలీలో మావోయిస్టు కమాండర్ విజా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని మావోయిస్టులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు