నయీం కేసులో సంచలనం..మరో కీలక పరిణామం

సినిమాల్లో వేల కోట్లు కొల్లగొట్టే గ్యాంగ్ స్టర్ లను చూస్తుంటాం.. మన పూరి జగన్నాథ్ అయితే గ్యాంగ్ స్టర్ లు లేకుండా ఈ మధ్య సినిమాలు తీయడం లేదు. కానీ రియల్ గ్యాంగ్ స్టర్ నయీంపై మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయడం లేదు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ మొదలుపెట్టినట్టే కనిపించినా ఆ సినిమా అతీగతీ లేకుండా పోయింది. 2016 ఆగస్టు 9 న జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మహబూబ్ […]

Written By: NARESH, Updated On : October 3, 2020 7:56 pm
Follow us on

సినిమాల్లో వేల కోట్లు కొల్లగొట్టే గ్యాంగ్ స్టర్ లను చూస్తుంటాం.. మన పూరి జగన్నాథ్ అయితే గ్యాంగ్ స్టర్ లు లేకుండా ఈ మధ్య సినిమాలు తీయడం లేదు. కానీ రియల్ గ్యాంగ్ స్టర్ నయీంపై మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయడం లేదు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ మొదలుపెట్టినట్టే కనిపించినా ఆ సినిమా అతీగతీ లేకుండా పోయింది. 2016 ఆగస్టు 9 న జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో హతమయ్యాడు.

Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

నయీం హతమయ్యాక మీడియా, అతడి బాగోతాలను పోలీసులు బయటపెట్టారు. ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టాడు.? భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా నయీం చీకటి కోణాలు బయటకు రావడంతో అంతా షాక్ అయ్యారు. నయీం బాధుతులు అందరూ బయటకు వచ్చి అతడు చేసిన ఘోరాలను చెప్పుకొచ్చారు. దీంతో నయీం కేసును సీబీఐతో కానీ విజిలెన్స్ తో కానీ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వచ్చింది.

నయీం కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.. నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అందుకే లోక్ పాల్ కిందకు తీసుకురావాలని కోరింది. నయీం కేసులో ఇప్పటికీ తేలని అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. నయీం డైరీ, భూములతోపాటు డబ్బులకు సంబంధించిన డంప్ ఎక్కడ ఉందో తేల్చాలని కోరింది. అయితే ఇంత సీరియస్ కేసులో పాత్ర ఉన్న పోలీసులక్ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కళంకిత పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ లభించడం సంచలనంగా మారింది. నయీంతో 25మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రాగా.. ఆ అధికారులను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Also Read: ‘ధరణి’లో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి..

కాగా నయీం కేసులో విచారణ జరిపిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆ 25మంది పోలీసు అధికారులకు ఊరట లభించింది. దీనికి వారికి ఇక పోస్టింగ్ లను ప్రభుత్వం ఇచ్చే అవకాశముంది. అంత పెద్ద కేసులో.. అన్ని ఆరోపణలు వచ్చిన కేసులో క్లీన్ చిట్ లభించడం చర్చనీయాంశమైంది.