Jr. NTR కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..! ఎవరు ఊహించనంతగా …!

NTR: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సింది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఫిల్మ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత తారక్ చేస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అవుతుండటం విశేషం. ఈ సంగతులు అటుంచితే..జూనియర్ ఎన్టీఆర్ చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతారని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అర్థమవుతుంది. కాగా, ఆయన లగ్జరియస్ లైఫ్, ఆయన వద్ద ఉన్న వస్తువులపైన […]

Written By: Mallesh, Updated On : January 15, 2022 5:43 pm
Follow us on

NTR: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సింది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఫిల్మ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత తారక్ చేస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అవుతుండటం విశేషం. ఈ సంగతులు అటుంచితే..జూనియర్ ఎన్టీఆర్ చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతారని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అర్థమవుతుంది. కాగా, ఆయన లగ్జరియస్ లైఫ్, ఆయన వద్ద ఉన్న వస్తువులపైన ఓ లుక్కేద్దాం…

NTR:

జూనియర్ ఎన్టీఆర్ ధరించేటువంటి ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ప్రైస్ రూ.19 లక్షలు. కాగా, ఆయనకు ఇదొక్కటే కాదు.. రకరకాల కంపెనీల కాస్ల్టీ వాచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకు చాలా ఇష్టమైన వాచెస్. కాగా, వివిధ సందర్భాల్లో ఆయనకు నచ్చిన వాచ్ ను ధరిస్తుంటారు. ఆయనకున్న ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్’ వాచ్ ప్రైస్ రూ.20 లక్షలుపైనే ఉంటుంది. ఇక ఆయన ధరించే మరో వాచ్ ‘బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్’ ప్రైస్.. రూ.7 లక్షల 12 వేలు. కాగా, ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర రూ.5 లక్షలు.

Also Read: Corona: కరోనా కాటు.. మళ్లీ స్కూళ్లు బందేనా?

జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తీకేయ పెళ్లికి వెళ్లినపుడు ధరించిన వాచ్ ప్రైస్ రూ. 2 కోట్ల 20 లక్షలు కావడం గమనార్హం. ఇక తారక్ వాడే కారు ధర రూ.కోటిన్నరకు పైనే ఉంటుంది. ఆయనకున్న మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు ప్రైస్ రూ.2.5 కోట్లు కాగా, బెంజ్ కారు ధర రూ.ఒక కోటి 20 లక్షలు. ఈ మోడల్ పేరు ‘మెంజ్ ఫోర్ మెటిక్’.
ఇక ఎన్టీఆర్ ప్రజెంట్ నివాసముంటున్న ఇళ్లు ధర రూ.50 కోట్లు. మొత్తంగా ఎన్టీఆర్ కింగ్ సైజ్ లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నాడని ఆయన వాడుతున్న వస్తువులను బట్టి అంచనా వేసుకోవచ్చు.
Tags