Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీIndia's X-Guard Decoy System: పాకిస్తాన్ మిస్సైల్‌ను మోసగించిన భారత్ డీకాయ్.. ఈ అద్భుత టెక్నాలజీతో...

India’s X-Guard Decoy System: పాకిస్తాన్ మిస్సైల్‌ను మోసగించిన భారత్ డీకాయ్.. ఈ అద్భుత టెక్నాలజీతో పాక్ చిత్తు.. వైరల్ వీడియో

India’s X-Guard Decoy System: యుద్ధం చేయడమంటే కాల్పులు మాత్రమే కాదు.. యుద్ధ సామగ్రిని వాడటమే కాదు.. శత్రుదేశం వేస్తున్న ఎత్తులు తెలియాలి.. ఆ ఎత్తులను చిత్తుచేయాలి. అప్పుడే యుద్ధంలో విజయం సాధ్యమవుతుంది. ఇవేమీ తెలియకుండా యుద్ధం చేస్తే నష్టమే మిగులుతుంది. ఇప్పుడు ఆ అనుభవం పాకిస్తాన్ దేశానికి తెలిసి వచ్చింది. భారత్ కొట్టిన దెబ్బకు ముఖం వాచిపోయింది.. వాస్తవానికి ఈ విషయాన్ని ఈ మీడియా హౌస్ కూడా బయట పెట్టలేకపోయింది. ఏ వార్తా సంస్థ కూడా రాయలేకపోయింది.

ఇటీవల ఉగ్రవాద దేశంపై భారత ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.. ఇందులో ఎలక్ట్రానిక్ వార్ టాక్టిక్స్ ఉపయోగించింది.. వీటి ద్వారా పాకిస్తాన్ వైమానిక దళాన్ని మోసం చేసింది.. భారత్ ప్రదర్శించిన యుద్ధ రీతిని అమెరికా మాజీ పైలట్ ప్రశంసించాడు. అమెరికా ఆర్మీలో F -15 E యుద్ధ విమానాన్ని నడిపిన ర్యాన్ బోడైన్హమర్ భారత్ చేసిన వార్ టాక్టిక్స్ ను ప్రశంసించాడు. ఇటీవల కాలంలో తమ ఎన్నడు ఈ స్థాయిలో డీ సెప్షన్(మోసం/మోసగింపు) ను చూడలేదని అతడు వ్యాఖ్యానించాడు.

Also Read: గంటకు 1,975 కిలోమీటర్ల వేగం.. 500 ఫీట్ల రన్ వే లోనే ల్యాండ్.. యుద్ధ విమానాలకే పెద్దమ్మ లాంటి ఈ ఫైటర్ విషయాలు తెలుసా?

ఆపరేషన్ సిందూర్ కోసం భారత్ రఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించింది. ఈ విమానాలలో ఎక్స్ గార్డ్ డీ కాయ్ అనేది అత్యంత కీలకమైనది. యుద్ధ విమానాలలో ఇంటిగ్రేట్ చేసిన స్పెక్ట్రా ఈడబ్ల్యూ స్యూట్ కూడా ఉంటుంది.. ఎక్స్ గార్డ్ అనే డీ కాయ్ అనేది శత్రుదేశాల విమానాల కళ్ళు కప్పుతుంది. పైగా ఇది జామింగ్ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. దీనిని ఇజ్రాయిల్ తయారు చేసింది. ఇది మొత్తంగా 33 కిలోల బరువు ఉంటుంది. వాస్తవ విమానం మాదిరిగానే ఇది 360 డిగ్రీల కోణంలో రాడారు సిగ్నల్స్ విడుదల చేస్తుంది. ఇందులో కృత్రిమ మేదతో పనిచేసే ఆల్గారిథం, డాప్ లర్ షిఫ్ట్ లతో అనుసంధానమై విమాన రాడార్ సంకేతాలను విడుదల చేస్తుంది. అప్పుడు శత్రు దేశాల విమానాలు దీనిని విమానం అని భావిస్తాయి. ఆ సమయంలో దీనిని ధ్వంసం చేయడానికి మిస్సైల్స్ ఉపయోగిస్తాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన PL -15 E మిస్సైల్స్ సమర్థవంతంగానే పనిచేస్తాయి. అయితే వీటిని రఫెల్ యుద్ధ విమానాల ఎక్స్ గార్డ్స్ దారి తప్పేలా చేశాయి.. దీంతో పాకిస్తాన్ ఎత్తులు మన ముందు పని చేయలేదు.

ఈ ప్రయోగం ద్వారా భారత వైమానిక దళం సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందు ఉందని ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ విభాగంలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించిందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.. ఆధునిక రఫెల్ యుద్ధ విమానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ డబ్ల్యూ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఎంత గొప్పగా ఉపయోగపడతాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సాగించిన ఈ విన్యాసం అత్యంత సాహసోపేతమైనది. ఆధునిక కాలంలో సాంకేతిక ప్రావీణ్యాన్ని.. వ్యూహాత్మకమైన మేధస్సును.. ప్రగతిశీల ఆవిష్కరణను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది ఒక రకంగా పాకిస్తాన్ వైమానిక దళానికి గుణపాఠం లాంటిది. అందుకే యుద్ధంలో మందు చూపే కాదు.. వెనక చూపు కూడా ఉండాలి. ప్లాన్ ఏ మాత్రమే కాదు.. ప్లాన్ బి, సి కూడా ఉండాలి. భారత్ పై వాటిని చేసింది. పాకిస్తాన్ చేయలేక మూసుకొని కూర్చుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version