
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శల దాడి చేస్తూ ప్రయోజనాలు పక్కాగా పొందుతోంది. ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుందో లేదో తెలియకపోయినా తెలంగాణ మాత్రం ఈ విషయాన్ని రాజకీయం చేస్తోంది. దీన్ని సాకుగా చూపి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న చుక్క నీరును కూడా ముందుగానే వాడుకుంటోంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. దీన్ని కూడా విద్యుత్ ఉప్పత్తికి వినియోగించుకుంటోంది.
కేటాయింపుల్లో తెలంగాణకు ఎడమ విద్యుత్ కేంద్రం దక్కింది. దీంతో శ్రీశైలంలో దండి నీరున్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉన్నా వరద రాక ముందే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటిని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. దీనిపై స్పందిస్తూ ఎఢమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కృష్ణాబోర్డు ఆదేశించింది.
కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు రాష్ర్టంలో జల విద్యుత్ ద్వారా వంద శాతం ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపలేకపోయిన కృష్ణాబోర్డును తామెందుకు పట్టించుకోవాలని తెలంగాణ భావిస్తోంది.
ఇప్పటికే కృష్ణా నీటిని దిగువకు రాకుండా ఉండేందుకు కొత్త ప్రాజెక్టులు కడతామని తెలంగాణ సర్కారు సర్వేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఆదేశాలను పాటించుకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమవుతోంది.