
బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా చేయడం వెనుక దురుద్దేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్ ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. చెత్త నగరంగా హైదరాబాద్ ని తయారు చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్ లో హైదరాబాద్ కు స్థానం లేదని తెలిపారు.