
రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన విద్యార్థులు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జూలై 3 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. జూలై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23 వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు సెల్ప్ రిపోర్టు చేయాలి.