https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఝలక్.. రిలీజ్ డేట్ లీక్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరగగా ఆ తరువాత కాలంలో సినిమా బడ్జెట్ 400 కోట్లకు పెరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుండగా ఈ సినిమా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 02:44 PM IST
    Follow us on


    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరగగా ఆ తరువాత కాలంలో సినిమా బడ్జెట్ 400 కోట్లకు పెరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    Also Read: కేజీఎఫ్ 2 మూవీ తెలుగు హక్కులు అన్ని కోట్లా..?

    ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లను ప్రకటించగా వేర్వేరు కారణాల వల్ల ఆ రెండు డేట్లకు సినిమా విడుదల కాలేదు. అయితే ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ పూర్తి కాగా త్వరలో రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాలో లేడీ స్కాట్ గా నటిస్తున్న హాలీవుడ్ నటి అలీసన్ డూడీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అక్టోబర్ 8వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.

    Also Read: అల్లరోడి ఆశలు ఈ సినిమాపైనే.. కల నెరవేరుతుందా..?

    అయితే ఆ తరువాత తన వల్లే రిలీజ్ డేట్ లీక్ అయిందని గ్రహించిన నటి చేసిన పొరపాటును గ్రహించి వెంటనే పోస్ట్ ను డిలేట్ చేశారు. అలా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించే నటి అలీసన్ డూడీ సినిమా రిలీజ్ డేట్ గురించి చెప్పకనే చెప్పేసింది. మరి ఆర్ఆర్ఆర్ మూవీ ఈ డేట్ కే విడుదలవుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ నెల 26న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో టీజర్ విడుదల కానుందని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు విడుదల కాగా ఆ రెండు టీజర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాహుబలి 2 సినిమాతో క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.