https://oktelugu.com/

గల్ఫ్ కార్మికుల గోడు పట్టించుకొనే కేసీఆర్ ప్రభుత్వం

దేశ, విదేశాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న తమ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వెనుకకు రప్పించుకోవడం కోసం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న ఈ ప్రాంతపు కార్మికుల గురించి పట్టించుకొంటున్న దాఖలాలు లేవు. తెలంగాణ నుంచి దాదాపు 12 నుంచి 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారందరిని ప్రభుత్వమే తెలంగాణకు తీసుకురావలసిన బాధ్యత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 12:35 PM IST
    Follow us on

    దేశ, విదేశాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న తమ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వెనుకకు రప్పించుకోవడం కోసం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న ఈ ప్రాంతపు కార్మికుల గురించి పట్టించుకొంటున్న దాఖలాలు లేవు.

    తెలంగాణ నుంచి దాదాపు 12 నుంచి 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారందరిని ప్రభుత్వమే తెలంగాణకు తీసుకురావలసిన బాధ్యత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో గల్ఫ్ లో ఇబ్బందులకు గురవుతున్న తెలంగాణకు చెందిన కార్మికులకు ఆసరాగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన ఎన్ ఆర్ ఐ సెల్ సహితం ఇప్పుడు ఉనికి కోల్పోయింది.

    ఇలా చేస్తేనే రైతుబంధు.. లేకుంటే లేదు!

    గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం తెలంగాణ నుండి వెళ్లిన కార్మికులు ప్రతి ఏడాది సుమారు రూ 1500 కోట్ల విదేశి మారక ద్రవాన్ని స్వరాష్ట్రానికి అందిస్తున్నారు. తెలంగాణ ఆర్ధికంగా బలోపేతం కావడంలో వారి పాత్ర ఎంతగానో ఉంది.

    అయితే ప్రస్తుతం కరోనాతో గల్ఫ్ దేశాల్లో ఆర్ధిక పరిస్థితులు మారిపోయాయి. అక్కడ చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో అక్కడ పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కార్మికులు కూడా పలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

    గల్ఫ్ లో చిక్కుకున్న వాళ్లను తెలంగాణకు తీసుకొచ్చెందుకు రాష్ట్రం ప్రభుత్వమే విమాన ఖర్చులు పెట్టుకోవాలని ప్రతిపక్షాలు, వలస కార్మికులకు సంబంధించిన ప్రజా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం నుండి స్పందన కనిపించడం లేదు. డబ్బులేక వలస వెళ్లిన వాళ్లను ప్రస్తుత పరిస్థితులలో విమాన ఖర్చులు పెట్టుకోమనడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.

    ఈ విషయమై కనీసం కేంద్ర ప్రభుత్వమును సంప్రదించి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాఖలాలు లేవు. గల్ఫ్ లో పని చేస్తున్న తమ దేశ కార్మికులను ఆయా దేశాలే అన్ని ఖర్చులు భరించి తమ దేశాలకు తీసుకువస్తుండటం గమనార్హం.

    గల్ఫ్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన కార్మికులకు భరోసా కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపించవలసి ఉంది.