ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన ” ఆల వైకుంఠపురంలో ” చిత్రానికి పాటలు గొప్ప వెన్నుదన్నుగా నిలిచాయి. ఒక సినిమా విజయానికి సాంగ్స్ ఎంతో దోహదం చేస్తాయనే విషయం మరో సారి ప్రూవ్ అయ్యింది. సినిమా విడుదలవ్వక ముందే పాటల ద్వారా మూవీకి హైప్ ఏర్పడింది.ఈ చిత్రం లోని పాటలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన కొంత మంది స్టార్ హీరోలు మ్యూజిక్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుదాం అని ఆలోచిస్తున్నారట.
మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వారు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి సొంతంగా మ్యూజిక్ కంపెనీలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ల దృష్టి కూడా మ్యూజిక్ కంపెనీలఫై పడి వారు కూడా అటు వైపుగా అడుగులు వేయాలని చూస్తున్నారట. పాటల మీద వస్తున్న ఇన్ కమ్.. అలానే తరతరాలకి వచ్చే రాయల్టీ.. అన్ని లెక్కలు వేసుకొని హీరోలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది .