https://oktelugu.com/

మాంసాహారులకు శుభవార్త.. శాఖాహారులుగా మారితే రూ.50 లక్షలు..?

దేశంలో నివశించే ప్రజలలో ఎక్కువమంది మాంసాహారం తీసుకుంటారు. మాంసం తినేవారిలో కొంతమందికి ప్రతిరోజూ మాంసం ఉండాల్సిందే. అయితే ఒక కంపెనీ మాత్రం మాంసాహార ప్రియులు శాఖాహారులుగా మారితే 50 లక్షల రూపాయలు గెలిచే అవకాశం కల్పిస్తోంది. అలవాట్లను కొంచెం మార్చుకుని 90 రోజుల పాటు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా ఉంటే మన దేశ కరెన్సీ ప్రకారం 50 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? బ్రిటన్ లోని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2021 / 02:59 PM IST
    Follow us on

    దేశంలో నివశించే ప్రజలలో ఎక్కువమంది మాంసాహారం తీసుకుంటారు. మాంసం తినేవారిలో కొంతమందికి ప్రతిరోజూ మాంసం ఉండాల్సిందే. అయితే ఒక కంపెనీ మాత్రం మాంసాహార ప్రియులు శాఖాహారులుగా మారితే 50 లక్షల రూపాయలు గెలిచే అవకాశం కల్పిస్తోంది. అలవాట్లను కొంచెం మార్చుకుని 90 రోజుల పాటు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా ఉంటే మన దేశ కరెన్సీ ప్రకారం 50 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు.

    Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    బ్రిటన్ లోని వైబ్రెంట్ వీగన్ అనే కంపెనీ వీగన్ క్యూరియస్ కోఆర్డినేటర్ ఉద్యోగాల కొరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మాంసాహారం తినేవారు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన వారికి కంపెనీ 90 రోజుల పాటు శాఖహార ఉత్పత్తులను ఇస్తుంది. అదే సమయంలో కంపెనీ ఒక న్యూట్రిషియన్ ద్వారా ఎంపికైన వ్యక్తిని తరచూ పర్యవేక్షిస్తుంది. మూడు నెలలపాటు ఎంపికైన వ్యక్తి మాంసాహారానికి దూరంగా ఉండాలి.

    Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    అదే సమయంలో ఎంపికైన వ్యక్తులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా శాఖాహారం గురించి ప్రచారం చేయాల్సి ఉంటుంది. మూడు నెలల తరువాత భవిష్యత్తులో మాంసం తినబోమని చెబితే వారు లక్షల విలువైన శాఖాహార ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శాఖాహారం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటారని ప్రూవ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మాంసాహారం తినడం వల్ల శరీరానికి పోషకాలు ఏ విధంగా అందుతాయో శాఖాహారం తినడం వల్ల కూడా అలాంటి పోషకాలు పొందేలా కంపెనీ ఆహారాన్ని ఇవ్వనుందని తెలుస్తోంది. వైబ్రంట్ వీగన్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.