https://oktelugu.com/

జగన్‌కు ఈడీ షాక్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ కోర్టు సమన్లు జారీచేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌ను ఆదేశించింది. ఆయనతోపాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి ఈడీ కోర్టు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2021 11:54 am
    Follow us on

    CM Jagan
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ కోర్టు సమన్లు జారీచేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌ను ఆదేశించింది. ఆయనతోపాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

    Also Read: వారి భేటీ వెనుక ఉన్న రహస్యం ఏంటో..?: అసలేం జరగుతోంది..

    నాంపల్లి కోర్టు నుంచి అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమన్లపై జగన్ తరఫు న్యాయవాదులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 11వ తేదీన వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతారా? లేక ఆయన తరఫును న్యాయవాదులు ఏదైనా మినహాయింపు కోరతారా? అనేది తేలాల్సి ఉంది.

    జగన్‌ ఆస్తుల కేసులపై సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే.. నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న చార్జిషీట్‌ను కూడా స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్‌లో కోరింది.

    Also Read: జగన్ వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు ఎందుకు?

    ఫార్మా కంపెనీలకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు చార్జిషీటు దాఖలు చేసేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టులోనే చార్జిషీట్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా కంపెనీలకు సంబంధించి అన్ని చార్జిషీట్లు సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయినా.. ఒక్కటి మాత్రం బదిలీ కాలేదు. దీనికి సంబంధించి మళ్లీ జగన్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. చార్జ్ షీట్‌లన్నీ వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ కోర్టు ఫార్మా కంపెనీలకు సంబంధించి కొత్త నెంబర్ వేసి నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. మరోవైపు 11న నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ఈడీ కోర్టుకు రావాలని సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్