ఏపీలో ఎన్నికల కమిషన్‌కు.. ఏపీ సర్కారుకు మధ్యనున్న పంచాయితీ ఇంకా కొలిక్కి రానే లేదు. కానీ.. ఎన్నికల సంఘం ప్రభుత్వ మాటను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. గడిచిన కొన్ని నెలలుగా ఈ రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న యుద్ధం అందరికీ తెలిసిందే. ఆ వివాదం నడుస్తుండగానే స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: వారి భేటీ వెనుక ఉన్న రహస్యం ఏంటో..?: అసలేం జరగుతోంది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేదు ఏపీ సర్కార్. కరోనా కొలిక్కి రాక ముందే.. ఎన్నికలను నిర్వహించటం సరికాదన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన మాత్రం మరొలా ఉంది. దీంతో వీరి ఇరువురి వాదనల్ని కోర్టుల్లో వినిపిస్తున్నారు. అభ్యంతరాల లెక్కలు ఒక కొలిక్కి రాక ముందే ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటంపై జగన్ సర్కారు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఓ వైపు తాము అభ్యంతరాలు చెబుతుంటేనే.. మరో వైపు నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైసీపీ ఫైర్ మీద ఉంది. ఎలాగైనా నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని చూస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఇప్పుడే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు నెలలు ఎన్నికలు లేకుండా చూస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Also Read: జగన్‌కు ఈడీ షాక్
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ ప్రోసీడింగ్స్ పై ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇందుకు తగ్గ పిటిషన్ దాఖలు చేసే వీలుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ సన్నద్ధతలో అధికార యంత్రాంగం ఉన్న వేళ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటం సరికాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరి.. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెబుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్