BBC- ED
BBC- ED: బ్రిటిష్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బీబీసీపై ఈడి అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇండియా పై తమ కేసు నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కింద బి బి సి పై కేసు నమోదు చేశామని ఈడి అధికారులు చెబుతున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విదేశీ మారకద్రవ్యం విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిసిందని, అందుకే తాము ఈ విధంగా చర్యలు తీసుకున్నామని ఈడి అధికారులు వివరించారు. ఇక బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం బ్రిటన్ లో ఉంది. కాగా ఇటీవల గోద్రా అల్లర్లకు సంబంధించి బి బి సి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం సామాజిక మాధ్యమాల నుంచి ఆ వీడియోను తొలగించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బి బి సి లో ఈడి సోదాలు నిర్వహించింది. ఇవి జరుగుతున్న సమయంలోనే బ్రిటన్ పార్లమెంట్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి సభ్యుడు ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు జర్నలిజాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచి వేస్తోందని ఆరోపించాయి. ఇక రాహుల్ గాంధీ అయితే బీబీసీకి సపోర్ట్ గా మాట్లాడారు. బ్రిటన్ లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. ఇవి కూడా అప్పట్లో చాలా వివాదాస్పదమయ్యాయి.
ఇక గొడవ సర్దుమరుగుతోంది అనే క్రమంలో అకస్మాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ బీబీసీ పై కేసును నమోదు చేసింది. అలాగని బిబిసి కేసు ఎదుర్కోవడం ఇది కొత్త కాదు. గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీలోని బిబిసి ఇండియా కార్యాలయంలో సర్వే నిర్వహించారు. మూడు రోజులపాటు సోదాలు చేపట్టారు. కీలకమైన ఆధారాలు సేకరించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సర్వేకు తాము సహకరిస్తామని చెప్పిన బిబిసి మొదటి రోజు అడిగిన వివరాలు ఇవ్వడంలో వెనుకంజ వేసింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు గట్టిగా అడగడంతో చివరికి డాక్యుమెంట్లు ఇవ్వక తప్పలేదు.. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కొన్ని పత్రాలు స్టేట్మెంట్లు ఇవ్వాలని అప్పట్లో ఐటీ అధికారులు అడిగితే బిబిసి ఇవ్వలేదు.
తాజాగా ఇదే విషయంపై ఈడి అధికారులు బిబిసిని ప్రశ్నించారు. తంగా ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరారు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో బిబిసి నిబంధనలు ఉల్లంఘించిందని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బిబిసి ఖాతా పుస్తకాల నిర్వహణలో అవకతవకలు ఉన్నాయని ఈడి అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే గతంలో ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు వారు గుర్తించిన సమాచారాన్ని ఈడి అధికారులతో పంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బిబిసి పరిధిలోని విదేశీ సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలు చేసుకుంటున్నప్పటికీ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు చెలరేగాయి. అయితే దీనిపై బిబిసి “ఇండియా; ది మోదీ క్వశ్చన్” పేరుతో రెండు భాగాలుగా ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది వలస వాద మనస్తత్వానికి నిదర్శమని కొట్టి పారేసింది. ప్రధానమంత్రి పై బురదజల్లేందుకు నిరాధారమైన వివరాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దేశంలో నిషేధం విధించింది.
BBC- ED
ఇక బిబిసి డాక్యుమెంటరీ పై ప్రపంచ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. చాలామంది బీబీసీ పై విమర్శలు చేశారు. కొందరు బిబిసిని సమర్థించారు. కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు..ఇవి జరిగిన కొన్ని రోజులకే ఈడి అధికారులు ఫెమా యాక్ట్ కింద బి బి సి పై కేసు నమోదు చేయడం విశేషం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ed has registered a case under fema against bbc india for fdi violations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com