
Manchu Manoj – Mounika : మోహన్ బాబు చిన్న కుమారుడు హీరో మనోజ్ మార్చి 3న భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. అక్క మంచు లక్ష్మి తన నివాసంలో వివాహం జరిపించింది. మనోజ్ 2019లో ప్రణతిరెడ్డితో విడిపోయారు. భూమా మౌనిక కూడా భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు. మోహన్ బాబు కుటుంబంతో భూమా ఫ్యామిలీకి చాలా కాలంగా పరిచయం ఉంది. ఆ విధంగా పెళ్ళికి ముందే మౌనిక, మనోజ్ ఒకరికొకరు తెలుసు. పరిచయం కూడా ఉంది.
అయితే వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది. అది పెళ్ళికి ఎలా దారితీసిందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మౌనిక, మనోజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఉన్న ‘అలా మొదలైంది’ టాక్ షోకి మనోజ్-మౌనిక వచ్చారు. ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అని అడగ్గా… నేనే అని మనోజ్ సమాధానం చెప్పారు. పెళ్లికి ముందు మొబైల్ లో ‘ఫోన్ నువ్వు పెట్టేయ్ కాదు నువ్వు పెట్టేయ్’ వంటివి అయ్యాయా? అని వెన్నెల కిషోర్ అడిగారు. ఎస్ పెళ్ళికి ముందు అవి జరిగాయని ఇద్దరూ ఒప్పుకున్నారు.
మనోజ్ కోపాన్ని నేను ఎలా మేనేజ్ చేయాలని భయపడ్డాను. కానీ ఇప్పుడు మనోజ్ నా కోపాన్ని మేనేజ్ చేస్తున్నాడని చెప్పి మౌనిక నవ్వేసింది. వీరిద్దరూ ఒకటి కావడానికి ఓ సంఘటన కారణమైందని మౌనిక చెప్పారు. అమ్మ చనిపోయాక ఆమె బర్త్ డే రోజు ఆలోచిస్తూ ఉన్నాను. అంతలో మనోజ్ నా వద్దకు వచ్చాడు. ఆ రోజు జీవితంలో మర్చిపోలేను అన్నారు. ఇక మేమిద్దరం ఒకటయ్యేందుకు యుద్ధం చేశామని మనోజ్ చెప్పారు. ఉప్పెన మూవీలో ‘ఈశ్వరా’ సాంగ్ ఐదు నిమిషాలే. కానీ సంవత్సరాల పాటు మేమిద్దరం ఊళ్లు పట్టుకుని తిరిగామని మనోజ్ చెప్పారు.
ఎన్ని డోర్లు అయినా మూసేయండి. మేము తగ్గేది లేదని నిశ్చయించుకున్నామని… మనోజ్ చెప్పారు.లేటెస్ట్ అలా మొదలైంది ప్రోమో వైరల్ అవుతుంది. పూర్తి ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం విష్ణు, మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. మనోజ్ కామెంట్స్ వాటిని బలపరిచేవిగా ఉన్నాయి.
వీడియోను కింద లింక్ లో చూడొచ్చు-https://youtu.be/iOTNfRBkwIU