Homeజాతీయ వార్తలుKalvaKuntla kavitha అమిత్ అరోరా అరెస్ట్: రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు.....

KalvaKuntla kavitha అమిత్ అరోరా అరెస్ట్: రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరుగనుంది?

KalvaKuntla kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన ఈడి… మళ్లీ రెచ్చిపోతోంది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. గుజరాత్ ఎన్నికలవేళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కార్నర్ చేసింది.. ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో పేరు నమోదు చేయనప్పటికీ.. ఆయన సన్నిహితుల పై నిఘా పెంచింది. ఫలితంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కి ఊపిరి ఆడటం లేదు. ఈడి ఎత్తులు ఇంకా మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి.. ఫలితంగా చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సైలెంట్ అయిపోయారు.. అరవింద్ కేజ్రివాల్ కూడా దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు.

-నెక్స్ట్ టార్గెట్ కవితేనా

మన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో కవిత పేరు కనిపించలేదు.. దీంతో ఆమెకు ఇక ఊరట లభించినట్టే అని అందరూ అనుకున్నారు.. కానీ ఈడీ అందరికీ షాక్ ఇస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను అరెస్టు చేసింది.. రిమాండ్ రిపోర్టును కోర్టుల సమర్పించింది.. అయితే ఇక్కడే అందరికి షాక్ ఇస్తూ అందులో కవిత పేరు కూడా ప్రస్తావించింది.. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లను అమిత్ ద్వారా విజయ్ నాయర్ కు చేర్చారని ఈడి తేల్చింది. ఇదే విషయాన్ని ఆరోరా కూడా అంగీకరించారని స్పష్టం చేసింది.

-డీల్ జరిగింది ఇలా

ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి కవిత ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు ఒక్కొక్కటిగా బలపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత పర్యవేక్షించారు. ఇందుకుగాను వందల కోట్లు స్వీకరించారు.. ఈ వ్యవహారాన్ని మొత్తం ఢిల్లీ కేంద్రంగా నడిపారు.. కవితకు ఈ వ్యవహారంలో అభిషేక్ రావు సహకారం అందించారు.. ఈయన ఎవరో కాదు తెలుగు నాట బాగా ప్రాముఖ్యం పొందిన అనూస్ బ్యూటీ పార్లర్ వ్యవస్థాపకుడు. ఇతడి భార్య అందులో ఒక పార్ట్నర్. ఇక తెలంగాణలోని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు శ్రవణ్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. శ్రవణ్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దగ్గర బంధువు.. అందు గురించే ఆయన ఈ వ్యవహారంపై పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇక సౌత్ గ్రూప్ ను కూడా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనకున్న పలుకుబడితో మేనేజ్ చేశారు..

-ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారు

అయితే ఈ స్కాం వివరాలు బయటకు రాకుండా నిందితులు ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చి మార్చి వాడారు.. ఎమ్మెల్సీ కవిత కూడా తరచూ ఫోన్లు మార్చి ఈ వ్యవహారం నడిపారు.. ఆ ఆధారాలు లభించకుండా ధ్వంసం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటివరకు కవిత పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు.. కానీ హఠాత్తుగా దినేష్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.. సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా వ్యవహరించారని చెబుతున్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసింది.. రేపో మాపో కవితకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్ గా మారి అధికారులకు వివరాలు మొత్తం చెప్పాడు.. అభిషేక్ రావు కూడా అప్రూవర్ గా మారతానని అధికారులకు చెప్పాడు. కానీ దీనిపై ఈడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అయితే ఇన్నాళ్లు మోడీ, ఈడి, బోడి అని రకరకాల వ్యాఖ్యలు చేసిన కవిత.. ఇప్పుడు ఈ డి నిజంగానే వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాల్సి ఉంది

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version