https://oktelugu.com/

Kantara : హాలీవుడ్ లో విడుదల కాబోతున్న ‘కాంతారా’

‘Kantara’ to be released in Hollywood : కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో అతి చిన్న సినిమాగా కన్నడలో విడుదలైన కాంతారా చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన కాంతారా ఒక చరిత్ర..అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాని ఇటీవలే ఓటీటీ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2022 / 09:18 PM IST
    Follow us on

    ‘Kantara’ to be released in Hollywood : కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో అతి చిన్న సినిమాగా కన్నడలో విడుదలైన కాంతారా చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన కాంతారా ఒక చరిత్ర..అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాని ఇటీవలే ఓటీటీ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే..ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మిశ్రమ స్పందనే వచ్చింది.

    అంతే వ్యూస్ పరంగా మాత్రం కాదు..ఏముంది ఈ సినిమాలో ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి అని చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది..అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ముందుగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో దబ్ చేసి గ్రాండ్ గా విడుదల చెయ్యాలని రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడు..అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి అట.

    ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో డీల్ కుదిరించుకున్న కాంతారా మూవీ టీం త్వరలోనే అమెరికన్ థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్ లో విడుదల చేయబోతున్నారట..ఇదే కనుక నిజమైతే హాలీవుడ్ లో డబ్ అయ్యి అక్కడి థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఏకైక సినిమాగా కాంతారా చిత్రం నిలుస్తుంది..పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేసే సత్తా ఒక్క రాజమౌళి కి మాత్రమే ఉంది అని అందరూ అనుకున్నారు..ఆయనే మొట్టమొదటి పాన్ వరల్డ్ రిలీజ్ ని చేస్తాడని అందరూ అనుకున్నారు..కానీ ఆయన కంటే ముందే కాంతారా చిత్రం ని విడుదల చెయ్యబోతున్నారు.

    ఒకవేళ ఈ సినిమా ఇంగ్లీష్ లో క్లిక్ అయితే సౌత్ ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్ ఓపెన్ అయ్యినట్టే..చూడాలి మరి కాంతారా చిత్రం హాలీవుడ్ ఆడియన్స్ కి థ్రిల్లింగ్ థియేట్రికల్ అనుభవాన్ని ఇస్తుందో లేదో అనేది..కన్నడ భాషతో మొదలై ఆ తర్వాత తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో..హాలీవుడ్ లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుందో లేదో చూడాలి.