Congress MLA Virendra Puppy Arrest: కళ్ళు చెదిరే నోట్ల కట్టలు. అన్ని 500 రూపాయలే. ఇదేదో మాఫియా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న డబ్బు కాదు. సంఘ విద్రోహ శక్తుల నుంచి స్వీకరించింది కాదు.. ఒక ఎమ్మెల్యే డెన్ నుంచి బయటికి లాగింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కోట్లు.. మొత్తం నగదే. దీనికి తోడు ఆరు కోట్ల బంగారు ఆభరణాలు కూడా.. ఈ స్థాయిలో నగదు, బంగారం ఒక ఎమ్మెల్యే దగ్గర్నుంచి లభించింది. ఆ ఎమ్మెల్యే పేరు కేసి వీరేంద్ర పప్పీ.. అతడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచాడు. మొదటినుంచి కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించడంలో పప్పీ సిద్ధహస్తుడు. సరిగ్గా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాన్ని నిన్ననే రాష్ట్రపతి ఆమోదించారు. ఆన్లైన్ బెట్టింగ్ బిల్లుపై సంతకం చేశారు. సంతకం చేయడం ఆలస్యం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విరుచుకుపడింది. భారీ స్థాయి నెట్వర్క్ ను బద్దలు కొట్టింది.
Also Read: ఆ వైసీపీ సీనియర్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
పప్పీ సిక్కిం లో అరెస్టయ్యారు. గత కొద్దిరోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థ విస్తృతంగా దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పప్పీ బాగోతం బయటపడింది. ఈ దర్యాప్తులో భారీగా అక్రమ నెట్వర్క్ బయటపడింది. దుబాయిలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న క్యాసినోలు.. గేమింగ్ కార్యకలాపాలు.. అక్రమ వ్యవహారాలు చాలావరకు బయటపడ్డాయి.. కేంద్ర దర్యాప్తు సంస్థ గత కొద్దిరోజులుగా సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో సిద్ధంగా దాడులు నిర్వహించింది. ముఖ్యంగా గోవాలోని పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ సెవెన్ క్యాసినో, బిగ్ డాడి క్యాసినో వంటి వాటిపై దాడులు చేసింది.. ఈ దాడుల్లో కేసి వీరేంద్ర బాగోతాలు బయటపడ్డాయి. అతడు కింగ్ 567, రాజా 567 వంటి బెట్టింగ్ వెబ్ సైట్ లు నిర్వహిస్తున్నాడు.
ఇతడు సోదరుడు తిప్పేస్వామి దుబాయ్ కేంద్రంగా కాల్ సెంటర్ సేవలు.. గేమింగ్ కార్యకలాపాలు.. ఇతర వ్యవహారాలకు సంబంధించిన సంస్థలను చూసుకుంటున్నాడు.. అధికారులు స్వాధీనం చేసుకున్న పన్నెండు కోట్ల నగదులో కోటి వరకు విదేశీ కరెన్సీ ఉంది.. ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలలో 10 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి.. దీనికి తోడు ఎంజీఎం, బిల్లా జియో, మెట్రోపాలిటన్, మెరీనా, క్యాసినో జువెల్ వంటి అంతర్జాతీయ క్యాసినో మెంబర్షిప్ కార్డులు ఉన్నాయి. తాజ్, హయత్, దీ లీలా వంటి లగ్జరీ హోటల్లో మెంబర్షిప్ కార్డ్స్ లు కూడా ఉన్నాయి.
అత్యధిక వ్యాల్యూ ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా ఉన్నాయి. ఇంతే కాదు సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ లో ఒక కాసినో ను లీజుకు తీసుకొని.. నడిపించే ప్రయత్నాలలో వీరేంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. వీరేంద్రకు సోదరుడైన కేసీ నాగరాజ్, మేనల్లుడు పృథ్వి ఎన్ రాజ్ కు సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలను, రెండు లాకర్లను కేంద్ర దర్యాప్తు సంస్థ స్తంభింపజేసింది.. వారికి సంబంధించిన ఆస్తి పత్రాలను కూడా తమ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేను సిక్కిం రాజధాని మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ కోసం కర్ణాటక రాజధానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.